Pawan Kalyan Kadapa Tour: అన్నమయ్య జిల్లాలో దాడి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఎంపీడీవో దాడి చేసినవారిని వదిలేది లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్‌బాబును పరామర్శించనున్నారు.
శనివారం ఉమ్మడి కడప జిల్లాకు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించ నున్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు గాలివీడు ఎంపీడీఓ జవహర్‌బాబుపై దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఎంపీడీఓకు తీవ్రగాయాలు అయ్యాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. విధి నిర్వహణలోఉన్న అధికారులపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా వర్ణించారు. ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదన్నారు. దాడి ఘటన గురించి అధికారులతో చర్చించారు డిప్యూటీ సీఎం.
ఘటనకు కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. ఎంపీడీఓకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు డిప్యూటీ సీఎం. వారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేదన్నారు.
దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వనున్నారు డిప్యూటీ సీఎం. ఇదిలావుండగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ALSO READ: జగన్‌ను బిగ్ షాక్.. మరో నేత రాజీనామా
మరోవైపు డిప్యూటీ టూర్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గాలివీడు కార్యక్రమం రద్దు అయినట్టు తెలుస్తోంది. నేరుగా కడప రిమ్స్‌కు వెళ్లి ఎంపీడీఓను పరామర్శించి, అక్కడి నుంచి కమలాపురం వెళ్లనున్నారు. వల్లూరు మండలంలోని పైడి కాలువ ఇసుక రీలను పరిశీలించనున్నట్లు సమాచారం.
డిప్యూటీ సీఎం పవన్ టూర్‌ను వైసీపీ నేతలు రాజకీయ కోణంలో చూస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఫ్యాన్స్ పార్టీకి చెందిన దిగువశ్రేణి నాయకత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో దాడులకు దిగుతున్నారు. దీన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి కడప జనసేన జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
మరోవైపు.. గాలివీడు ఘర్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్
జవహర్ బాబును పరామర్శించనున్న పవన్ కళ్యాణ్ pic.twitter.com/uTmkwAPX9g
— BIG TV Breaking News (@bigtvtelugu) December 28, 2024