Aloe Vera For Skin: అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్స్ వాడుతుంటారు. బయట మార్కెట్ లో దొరకే ఫేస్ క్రీములు వాడటం వల్ల కొంత మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అంతే కాకుండా వీటిని వాడటం ద్వారా జరిగే లాభాల కంటే నష్టాలే ఎక్కవగా ఉంటాయి. అందుకే ఇంట్లోనే నేచురల్ గా కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అలోవెరాతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను ముఖ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా మొటిమల సమస్యను కూడా తగ్గిస్తాయి. మరెన్నో ప్రయోజనాలు ఉన్న అలోవెరాతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద:
కలబందలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. అంతే కాకుండా కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కలబంద, నిమ్మరసంతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
కలబంద: 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్
అలోవెరా జుల్ – 1 టీ స్పూన్
తయారీ విధానం: ముందుగా పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్ లోకి తీసుకుని బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం ద్వారా ముఖంపై జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
నిమ్మకాయ:
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మార్చే సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ కూడా.
కలబంద, నిమ్మకాయతో ఫేస్ సీరమ్ :
కావాల్సినవి:
తాజా కలబంద జెల్ – 2 టీస్పూన్లు
తాజా నిమ్మరసం – 1 స్పూన్
విటమిన్ ఇ క్యాప్సూల్ – 1
గ్లిజరిన్ – కొన్ని చుక్కలు (ఇష్టమైతే)
ఒక చిన్న సీసా
తయారు చేసే విధానం:
ముందుగా పైన చెప్పన మోతాదులో అలోవెరా జెల్‌ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి నిమ్మరసం ,విటమిన్ ఇ క్యాప్సూల్ ఆయిల్ కలపండి.
మీ చర్మం చాలా పొడిగా ఉంటే, దీనికి కొన్ని చుక్కల గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటీ బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని చిన్న సీసాలో నింపండి.
ఫేస్ సీరమ్ ఎలా ఉపయోగించాలి ?
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఈ ఫేస్ సీరమ్ యొక్క కొన్ని చుక్కలను తీసుకొని ముఖం, మెడపై సున్నితంగా మసాజ్ చేయండి .
తర్వాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం ముఖం కడుక్కోవాలి.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. జన్మలో జుట్టు రాలదు
ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి:
నిమ్మరసం చర్మాన్ని సున్నితంగా మార్చగలదు. కాబట్టి దీన్ని నేరుగా చర్మంపై అప్లై చేయకండి. కలబందతో నిమ్మరసం కలపి మాత్రమే దీన్ని ఉపయోగించండి.
ఎండలోకి వెళ్లే ముందు ఈ సీరమ్‌ని ఉపయోగించవద్దు.
ఈ సీరమ్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.