BigTV English

Monalisa: కుంభమేళా మోనాలిసా ఇప్పటివరకు ఎంత సంపాదించిందో తెలుసా?

Monalisa: కుంభమేళా మోనాలిసా ఇప్పటివరకు ఎంత సంపాదించిందో తెలుసా?

Monalisa..అదృష్టం ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో చెప్పడం కష్టం.. అసలు ఎవరైనా ఊహించారా? ఒక జాతరలో పూసలు అమ్ముకునే అమ్మాయి ఓవర్ నైట్ లోనే స్టార్ అవుతుందని.. మనం ప్రతిరోజు ప్రతి విలేజ్ లో ప్రతి జాతరలో ఎంతోమంది పూసలమ్మే అమ్మాయిలను చూస్తూనే ఉంటాం. కానీ వారెవరికి పట్టని యోగం ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పూసలమ్మే అమ్మాయికి దక్కింది. అంతేకాదు ఆ అమ్మాయిని మహార్జాతకురాలిగా మార్చేసింది కూడా..ఇక ఇప్పటికే ఆమె ఎవరో అందరికీ గుర్తొచ్చే ఉంటుంది కదా. ఆమెనండి మోనాలిసా. మహా కుంభమేళాలో జీవనాన్ని గడుపుకోవడానికి కుటుంబంతో కలిసి పూసలు అమ్మడానికి వచ్చింది మోనాలిసా.


రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన మోనాలిసా..

అక్కడ ఒక వ్యక్తి ఈమె దగ్గరికి పూసలు కొనుగోలు చేయడానికి వచ్చి.. ఆమె అందం చూసి ముగ్దుడైపోయాడు. వెంటనే ఆమెను ఫోటో తీసి అంతర్జాలంలో పెట్టేసాడు. ఇంకేముంది రాత్రికి రాత్రే సంచలనంగా మారింది ఈ ముద్దుగుమ్మ. తన వ్యక్తిత్వం, అందమైన చిరునవ్వు.. నేరేడు లాంటి కళ్ళు. ఈమెను చూసి మోహితుడు అవ్వని యువకుడు లేడేమో.. ఈమె అందాన్ని ఆరాధించని కుర్రాళ్ళు లేరేమో.. అంతలా తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమె ప్రేమలో ప్రపంచం మొత్తం మునిగిపోయిందనే చెప్పాలి.


ఇదిలా ఉండగా మరొక వైపు మోస్ట్ అవైటెడ్ సాంగ్ అయినటువంటి మోనాలిసా నటించిన పాట యూట్యూబ్లో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు ఈ వీడియోని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. పూసలమ్మాయి ఒక హీరోయిన్ అవతారం ఎత్తితే ఎలా ఉంటుందో చూడడానికి ఆసక్తిగా చూసిన వారందరికీ ఇది మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. ఇక మోనాలిసా మ్యూజిక్ వీడియో సాద్గీ 2025 జూన్ 14న విడుదల అవ్వగా ఇందులో మోనాలిసా ఉత్కర్ష్ సింగ్ తో కలిసి నటించింది.

also read: Film industry: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో స్టార్ డైరెక్టర్.. మిస్ అయ్యాడా ? చనిపోయాడా ?

మోనాలిసా సంపాదన ఎంతో తెలుసా?

తన తొలి ప్రదర్శనతోనే లక్షలాదిమంది హృదయాలను దోచుకుంది. ఈ మ్యూజిక్ వీడియోలో మోనాలిసా ఎంబ్రాయిడరీ లెహంగా ధరించి.. అందుకు సరిపడా ఆభరణాలతో అద్భుతంగా ఆకట్టుకుంది. అవకాశం రావాలే కానీ అదృష్టం తలుపు తడితే ఏదో ఒక రోజు మోనాలిసా హీరోయిన్ అయి నిరూపిస్తుంది అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ మిశ్రా కూడా ఈమెకు తన హిందీ చిత్రంలో నటించడానికి అవకాశం కల్పించారు. ఇక దీంతో మోనాలిసా ఏ రేంజ్ లో సంపాదిస్తుందో? తన ఆదాయం ఎంతో? వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ.. తల్లి గంగా ఆశీర్వాదాలతో కొంచెం సంపాదిస్తున్నానని తెలిపిన ఈమె.. అభిమానుల మద్దతు, ప్రజల ఆశీర్వాదాలతో కోట్లు, బిలియన్లలో కూడా సంపాదిస్తానని మోనాలిసా తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ పలు యాడ్స్లలో నటిస్తున్న ఈమె.. ఇప్పటివరకు సుమారుగా రూ.20 లక్షల వరకు సంపాదించినట్లు సమాచారం. ఇక భగవంతుడి ఆశీస్సులు తనపై ఉంటే కోట్లే కాదు బిలియన్లు కూడా సంపాదిస్తానని తెలిపింది. మరి భవిష్యత్తులో ఈమెకు అవకాశాలు ఏ రేంజ్ లో తలుపు తడతాయో చూడాలి.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×