Morning Skin Care Routine: ముఖం అందంగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందుకోసం అమ్మాయిలు, అబ్బాయిలూ రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీఎలాంటి ఫలితం ఉండదు. ఇలాంటి సమయంలో ఉదయం పూట నిద్ర లేవగానే కొన్ని స్కిన్ కేర్ టిప్స్ పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల చర్మం రోజంతా తాజాగా, ఆరోగ్యంగా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ఉదయం ముఖంపై ఏమి అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1.ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేయండి:
ఉదయం నిద్రలేచిన వెంటనే.. ముందుగా మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇది రాత్రిపూట పేరుకుపోయిన నూనెను, ధూళిని తొలగిస్తుంది. చల్లటి నీరు ముఖ రంధ్రాలను బిగించి, అదనపు నూనెను అదుపులో ఉంచుతుంది. మీకు కావాలంటే..మీరు ఫేస్ వాష్‌ను కూడా ఉపయోగించవచ్చు.
2. కలబంద జెల్ రాయండి:
జిడ్డు చర్మం ఉన్నవారికి కలబంద జెల్ ఒక వరం లాంటిది. ఇది చర్మాన్ని సహజంగా చల్లబరుస్తుంది. అంతే కాకుండా ముఖంపై నూనెను నియంత్రిస్తుంది. ఉదయం ముఖం కడిగిన తర్వాత, కొద్దిగా కలబంద జెల్ ను మీ ముఖం అంతా రాయండి. ఇది చర్మాన్ని తేమగా చేస్తుంది. అంతే కాకుండా మొటిమలను కూడా నివారిస్తుంది.
3. రోజ్ వాటర్ లేదా టోనర్‌తో చర్మాన్ని టోన్ చేయండి:
టోనర్ చర్మాన్ని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా ఓపెన్ ఫోర్స్‌ను తగ్గిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి రోజ్ వాటర్ ఒక గొప్ప సహజ టోనర్. దీనిని ముఖంపై స్ప్రే చేయండి లేదా కాటన్ సహాయంతో ముఖంపై అప్లై చేయండి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. అంతే కాకుండా ఆయిలీ స్కిన్ సమస్యను తగ్గిస్తుంది.
Also Read: ఆముదం ఇలా వాడితే.. చర్మం, జుట్టు సమస్యలు అస్సలు రావు !
4. ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అప్లై చేయండి:
ఆయిలీ స్కిన్ ఉన్న వారు మాయిశ్చరైజర్ వాడాల్సిన అవసరం లేదని అనుకుంటారు.కానీ ఇది ఒక అపోహ మాత్రమే.మీ చర్మాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. లేకపోతే చర్మం ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి.. ఉదయం జెల్ ఆధారిత లేదా నూనె లేని మాయిశ్చరైజర్ అప్లై చేయండి.
5. సన్‌స్క్రీన్ తప్పకుండా వాడండి:
ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సి వచ్చినా.. వెళ్ళకపోయినా సన్‌స్క్రీన్ అప్లై చేయడం చాలా ముఖ్యం. జిడ్డు చర్మానికి, మ్యాట్ ఫినిష్ లేదా జెల్ సన్‌స్క్రీన్ ఉత్తమమైనది.ఇది సూర్యుడి హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించడమే కాకుండా.. చర్మానికి ఆయిల్ ఫ్రీ లుక్‌ను అందిస్తుంది.
పై స్కిన్ రొటీన్ పాటించడం వల్ల కూడా చర్మం తెల్లగా మెరిసిపోతుంది. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం ప్రతి ఒక్కరూ ఉదయం పూట ఈ చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం. బయట మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్స్ వాడటానికి బదులుగా హోం రెమెడీస్ వాడటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.