Akhanda 2 UpDate : నందమూరి నట సింహం బాలయ్య ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో భాగంగా బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న వెంటనే అటు బోయపాటి శ్రీనును బాలయ్య పరిగెత్తిస్తున్నారని తెలుస్తుంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
65 ఏళ్ల వయసు ఉన్న బాలకృష్ణ వరుస పెట్టి హిట్ సినిమాలు చేస్తున్నాడు. రూలర్ డిజాస్టర్ తర్వాత బాలయ్య చేసిన నాలుగు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాడు. ఎవర్‌గ్రీన్ కాంబినేషన్ బోయపాటి – బాలకృష్ణ మరో సారి థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి.
ఇప్పుడు వీరి కాంబోలో నాలుగో సినిమాగా అఖండ 2 రాబోతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25 అని అనౌన్స్ చేశారు. అనుకున్న టైంకి సినిమా థియేటర్స్‌కు తీసుకురావడానికి మూవీ టీం కష్టపడుతుంది. ఇదే టైంలో డైరెక్టర్ బోయపాటిని బాలకృష్ణ పరిగెత్తిస్తున్నాడట.
రెస్ట్ లేకుండానే…
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డును బాలయ్య అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు కార్యక్రమం జూన్ 14న జరిగింది. అందుకోసం అఖండ 2 మూవీ షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారు. జూన్ 14తో అవార్డు అందుకోవడం పూర్తి అయిపోయింది.
దీంతో వెంటనే షూటింగ్ స్టార్ట్ చేశారు బాలయ్య. ప్రస్తుతం అఖండ 2 మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ స్టూడియోలో జరుగుతుంది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్స్ లో ఈ సినిమా చేస్తున్నారట. ఈ షెడ్యూల్ దాదాపు రెండు వారాలు పాటు ఉంటుందట. ఈ షెడ్యూల్ పూర్తి అయితే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయినట్టే అని సమాచారం.
అలాగే ఈ షెడ్యూల్‌లోనే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు బాలయ్యపై మరి కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేస్తున్నారట. దీని కోసం ప్రాధాన తారగణం మొత్తం అటెంట్ అవుతుందని తెలుస్తుంది.
ఇటు షూటింగ్ – అటు సీజీ వర్క్
ఇటు షూటింగ్ జరుపుతూనే అటు ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ ను కూడా చేస్తున్నారట. దీంతో డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు షూటింగ్, సీజీ వర్క్స్ ఒకే సారి చూసుకోవడం కత్తి మీద సాము అనేలా తయారైందట. ఏది ఏమైనా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడమే లక్ష్యం మూవీ టీం పనులు చేస్తున్నారు. బాలయ్య కూడా అదే స్పీడ్ లో ఉండటమే కాకుండా, డైరెక్టర్ బోయపాటిని కూడా పరిగెత్తిస్తున్నాడట.
అయితే సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే, అఖండ 2 ఆ డేట్ ను వెనక్కి జరిగడం ఖాయం అని అనుకోవచ్చు. మరి అది జరుగుతుందో లేదా అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆధారపడి ఉంటుంది.