Film industry:అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmadabad Plane Crash) ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపింది.ఎన్నో కుటుంబాల్లో జీవితాంతం గుర్తిండిపోయే కన్నీళ్లు మిగిల్చింది.అయితే అలాంటి ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ విషయంలో ఇప్పటికే ఎన్నో వార్తలు మీడియా వేదికగా ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులతో పాటు మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద ఆ విమానం పడడంతో అందులో ఉన్న మెడికోలు కూడా దాదాపు 30 మంది వరకు చనిపోయారు.అలా దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి తాజాగా మరో విషయం బయటపడింది . అదేంటంటే అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగినప్పటి నుండి ఓ బాలీవుడ్ డైరెక్టర్ (Bollywood Director) కనిపించకుండా పోయారని తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ బాలీవుడ్ డైరెక్టర్ భార్య ఏం చెప్పింది..? ఆయన బతికి ఉన్నట్టా? లేనట్టా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో డైరెక్టర్ మిస్..
బాలీవుడ్ డైరెక్టర్ గా చిన్న చిన్న డాక్యుమెంటరీలు తీస్తూ ఇండస్ట్రీలో ఎంతో కొంత ఫేమస్ అయిన మహేష్ కళావడియా (Mahesh Kalawadia) చిన్న చిన్న మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ.. డాక్యుమెంటరీలు తీస్తూ ఉంటారు. అయితే అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగినప్పటి నుండి మహేష్ ఆచూకీ తెలియడం లేదని ఆయన భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగే ముందు తన భర్త ఫోన్ చేసి లా గార్డెన్ (Law Garden)లో ఒకరిని కలవడానికి వెళ్లినట్టు చెప్పారట. అయితే మహేష్ కళావడియా వెళ్లిన ఆ గార్డెన్ అహ్మదాబాద్ లో విమానం ప్రమాదం ఎక్కడైతే కూలిపోయిందో ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉందట.అయితే భార్యతో మాట్లాడి మీటింగ్ అయిపోయింది ఇంటికి వస్తున్నానని ఫోన్ పెట్టేసారట.ఆ తర్వాత అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడం దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారడం అన్ని మనకు తెలిసిందే.
also read: Maruthi: ఇండస్ట్రీలోకి రాకముందు మారుతి ఏం చేసేవారో తెలుసా.. కల నెరవేరిందా?
డైరెక్టర్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు..
అయితే ఈ విమాన ప్రమాదం జరిగినప్పటి నుండి మళ్ళీ తన భర్త తనకి ఫోన్ చేయలేదని, తన భర్త ఆచూకీ కూడా తెలియడం లేదని పోలీసులకు కంప్లైంట్ చేసింది మహేష్ భార్య. అలాగే మహేష్ చివరిగా ఫోన్ ఎక్కడ మాట్లాడారో ఆ ఫోన్ సిగ్నల్స్ ని ట్రేస్ చేయగా అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం ఎక్కడ జరిగిందో ఆ ప్రమాద స్థలానికి 700 మీటర్ల దూరంలో ఆయన మాట్లాడిన లొకేషన్ ని పోలీసులు గుర్తించారు. ఇక ఈ విషయం బయట పడడంతో మహేష్ కళావడియా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలు మహేష్ కళావడియా బతికున్నాడా లేక చనిపోయాడా అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్యులు మహేష్ డిఎన్ఏని తీసుకొని విచారణ చేస్తామని తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ డైరెక్టర్ మిస్సింగ్ కేసు మాత్రం పోలీసులకి ఛాలెంజింగ్ గా మారింది.