BigTV English
Advertisement

Movies : థియేటర్లు, ఓటీటీల్లో న్యూమూవీస్ సందడి.. ఈ వారం విడులయ్యే సినిమాలు ఏంటో తెలుసా..?

Movies : థియేటర్లు, ఓటీటీల్లో న్యూమూవీస్ సందడి.. ఈ వారం విడులయ్యే సినిమాలు ఏంటో తెలుసా..?


Latest Movies Updates : మే మొదటి శుక్రవారం 4 సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. గోపీచంద్‌ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం రామబాణం. డింపుల్‌ హయాతి హీరోయిన్. శ్రీవాస్‌ డైరెక్షన్ లో ఈ మూవీ రూపొందింది. ఈ మూవీలో జగపతిబాబు, ఖుష్బూ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఉగ్రం. మిర్నా కథానాయిక. విజయ్‌ కనకమేడల డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ మూవీని నిర్మించారు. మే 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.


ఆరుగురు అమ్మాయిలు.. ముగ్గురు అబ్బాయిల కథతో రోషన్‌, ముస్తఫా ఆస్కరి, శ్రీనివాస్‌, అనిరుధ్‌, లయ, ఇందు, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, జబర్దస్త్‌ సత్తిపండు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరంగేట్రం’. శ్రీనివాస్‌ ప్రభన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వాస్తవిక ఘటనల ఆధారంగా రూపొందిన సినిమా యాద్గిరి అండ్‌ సన్స్‌. అనిరుధ్‌ తుకుంట్ల, యశ్విని నివేదిత, జీవా, రాజీవ్‌ కనకాల, మధుమణి, మురళీధర్‌గౌడ్‌, రోహిత్‌ కీలక పాత్రలు పోషించారు. భిక్షపతిరాజు పందిరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 5న థియేటర్లలో విడుదల కానుంది.

మరోవైపు ఓటీటీల్లో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే..!

డిస్నీ+హాట్‌స్టార్‌..
కరోనా పేపర్స్‌ (మలయాళ చిత్రం )- మే 5
సాస్‌ బహూ ఔర్‌ ఫ్లమింగో (హిందీ) -మే 5

జీ 5..
ఫైర్‌ ఫ్లైస్‌ (హిందీ సిరీస్‌) -మే 5
షెభాష్‌ ఫెలూద (బెంగాలీ) -మే 5

ఈటీవీ విన్‌..
మ్యాచ్‌ ఫిక్సింగ్‌(తెలుగు) -మే 5

నెట్‌ఫ్లిక్స్‌..
క్లిఫర్డ్‌: ది బిగ్‌ రెడ్‌ డాగ్‌ (ఇంగ్లీష్‌) -మే2
ది టేర్‌ (ఇంగ్లీష్‌) మే 2
క్వీన్‌ షార్లెట్‌: ఏ బ్రిడ్జిర్టన్‌ స్టోరీ (వెబ్‌సిరీస్‌) -మే 4
శాంక్చురీ (మూవీ) -మే 4
ది లార్వా ఫ్యామిలీ(యామినేషన్‌) -మే 4
మీటర్‌: (తెలుగు) -మే 5
తూ ఝూటీ మై మక్కార్‌ (హిందీ) -మే 5
3 (తెలుగు) -మే 5
అమృతం చందమామలో (తెలుగు) -మే 5
యోగి (తెలుగు) -మే5
రౌడీ ఫెలో (తెలుగు)- మే 5
తమ్ముడు (తెలుగు) -మే 5

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×