BigTV English

Movies : ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి.. ఓటీటీల్లో విడుదలయ్యే మూవీస్ ఏంటో తెలుసా..?

Movies : ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి.. ఓటీటీల్లో విడుదలయ్యే మూవీస్ ఏంటో తెలుసా..?

Latest movie releases this week(Today tollywood news) : ఈ వేసవి సీజన్ లో టాలీవుడ్ లో లోబడ్జెట్ చిత్రాల హవా కొనసాగుతోంది. 3 వారాలుగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. జూన్‌ మొదటి వారంలోనూ మరికొన్ని చిన్న మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ అహింస చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీని తేజ తెరకెక్కించాడు. ఈ సినిమా జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రజత్‌ బేడీ, గీతిక, సదా, రవికాలే, కమల్‌ కామరాజు, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవిప్రసాద్‌ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆర్పీ పట్నాయక్‌ మ్యూజిక్ అందించారు.

స్వాతిముత్యం సినిమాతో తొలి ప్రయత్నంలో హీరోగా మెప్పించిన బెల్లంకొండ గణేష్‌ .. ఇప్పుడు నేను స్టూడెంట్‌ సార్‌ అంటూ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీలో అవంతిక కథానాయికగా నటించింది. సముద్ర ఖని, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 2న విడుదలకానుంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ స్వరాలు అందించాడు.


సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్‌ జీఎల్‌బి తెరకెక్కించిన ఐక్యూ చిత్రం రివీజ్ కు రెడీ అయ్యింది. పవర్‌ ఆఫ్‌ స్టూడెంట్‌.. అన్నది ఉపశీర్షిక. సుమన్‌, సత్య ప్రకాష్‌, బెనర్జీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకురాబోతోంది.

రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వంలో తిరువీర్‌, పావని కరణం జంటగా నటించిన కామెడీ మూవీ పరేషాన్ జూన్ 2 న విడుదలకానుంది. ఈ మూవీకి రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

అజయ్‌ ప్రధాన పాత్రలో చెట్కూరి మధుసూధన్‌ తెరకెక్కించిన చిత్రం చక్రవ్యూహం.. ది ట్రాప్‌.. జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో జ్ఞానేశ్వరి, వివేక్‌ త్రివేది, ఊర్వశి పరదేశి కీలక పాత్రలు పోషించారు.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే మూవీస్..!
జీ 5..
విష్వక్‌ (తెలుగు) -జూన్‌ 2

డిస్నీ+ హాట్‌స్టార్‌..
సులైకా మంజిల్‌ (మలయాళం)- మే 30

జియో సినిమా..
అసుర్‌- 2 (హిందీ సిరీస్‌)- జూన్‌ 1

బుక్‌ మై షో..
ఈవిల్‌ డెడ్‌ రైజ్‌ (హాలీవుడ్‌)- జూన్‌ 2

నెట్‌ఫ్లిక్స్‌..
ఫేక్‌ ప్రొఫైల్‌ (వెబ్‌సిరీస్‌) – మే 31
ఏ బ్యూటిఫుల్‌ లైఫ్‌ (హాలీవుడ్‌)- జూన్‌ 1
న్యూ ఆమ్‌స్టర్‌ డామ్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 1
ఇన్ఫినిటీ స్టోర్మ్‌ (హాలీవుడ్‌)-జూన్‌ 1
స్కూప్‌ (హిందీ సిరీస్‌)-జూన్‌ 2
మ్యానిఫెస్ట్‌ (వెబ్‌సిరీస్‌)-జూన్ 2

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×