Big Stories

Manipur : మణిపూర్‌లో మళ్లీ హింస.. 40 మంది కాల్చివేత.. అమిత్ షా టూర్ ..

Manipur : మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. తిరుగుబాటుదారుల నిరసనలతో ఆ రాష్ట్రం అట్టుకుతోంది. వారిపై మణిపూర్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 40 మంది వేర్పాటు వాదులను కాల్చి వేసింది. తిరుగుబాటుదారులను ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఉగ్రవాదులతో పోల్చారు. తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మణిపూర్‌ లో పర్యటించనున్నారు. సోమవారం నుంచి నుంచి జూన్‌ 1 వరకు ఆ రాష్ట్రంలోనే ఉంటారు.

- Advertisement -

సాయుధ కుకి మిలిటెంట్లు ప్రత్యర్థి మైతి వర్గానికి చెందిన 8 కొండ ప్రాంత గ్రామాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కక్చింగ్‌ జిల్లాలో మిలిటెంట్లు మైతి వర్గానికి చెందిన వారి ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో,గ్రామస్తులు భయంతో పారిపోయారు.

- Advertisement -

సుగ్నులో పోలీసులు, మిలిటెంట్ల మధ్య జరిగిన కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక పోలీసు మృతిచెందాడు. సుగ్ను, సెరౌ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బిష్ణుపూర్‌ జిల్లాలో కుకి మిలిటెంట్లు మైతి వర్గానికి చెందిన వారి ఇళ్లకు నిప్పుపెట్టారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధికారులు నిషేధాజ్ఞల సడలింపు సమయాన్ని 11 గంటల నుంచి 6 గంటలకు కుదించారు. 0

రాష్ట్రంలో పౌరులపై కాల్పులకు దిగుతూ, ఇళ్లకు నిప్పుపెడుతున్న 40 మంది తీవ్రవాదులను ఇప్పటి వరకు భద్రతా బలగాలు హతమార్చాయని సీఎం బిరేన్‌ సింగ్‌ ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్నది జాతుల మధ్య వైరం కాదన్నారు. కుకి మిలటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్నారు. షెడ్యూల్‌ తెగ హోదా విషయంలో రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి కుకి, మైతి వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మొత్తం 75 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News