E-Paper
Advertisement

Movies : ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే మూవీస్ ఏంటో తెలుసా..?

Movies : ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే మూవీస్ ఏంటో తెలుసా..?

Movie releases this week(Entertainment News Updates): వేసవి సీజన్ లో వారంవారం థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. వచ్చే శుక్రవారం ఆసక్తికర మూవీస్ విడుదల కాబోతున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ కొన్ని మూవీస్, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి.
నాగ చైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం కస్టడీ మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీలో కృతి శెట్టి కథానాయికగా, అరవింద్‌ స్వామి ప్రతినాయకుడిగా నటించారు. శరత్‌ కుమార్‌, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన హిందీ చిత్రం ఛత్రపతి. వి.వి వినాయక్‌ తెరకెక్కించారు. నుస్రత్‌ భరుచా హీరోయిన్ గా నటించింది. ప్రభాస్‌-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతిని అదే పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ఈ మూవీ మే 12న విడుదల కానుంది.

సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ భువన విజయమ్‌. కొత్త దర్శకుడు యలమంద చరణ్‌ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ మే 12 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. రవి ప్రకాష్ బోడపాటి డైరెక్షన్ లో రూపొందిన మూవీ ‘ది స్టోరీ ఆఫ్‌ బ్యూటిఫుల్‌ గర్ల్‌’. నిహాల్‌ కోదాటి, దృషికా చందర్‌ లీడ్ రోల్స్ పోషించారు. ఈ సినిమా మే 12 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

శేఖర్‌ అయాన్‌ వర్మ, వైభవి రావ్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘కళ్యాణమస్తు’. సాయి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పాపారావు బియ్యాల తెరకెక్కించిన మూవీ ‘మ్యూజిక్‌ స్కూల్‌’. ఈ సినిమాలో శ్రియ శరణ్‌, శర్మాన్‌ జోషి, షాన్‌ లీడ్ రోల్స్ చేశారు. ఇళయరాజా స్వరాలు అందించారు. ఈ సినిమా మే 12న విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న మూవీస్/వెబ్‌సిరీస్‌లు..
నవదీప్‌, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ న్యూసెన్స్‌. ఈ వెబ్‌ సిరీస్‌ ఆహాలో మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.రీమా కగ్తీ, జోయా అక్తర్ తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ దహాద్‌. ఇందులో సోనాక్షి సిన్హా , విజయ్‌వర్మ, గుల్షన్‌ దేవయ్య, సోహమ్‌ షా లీడ్ రోల్స్ చేశారు. ఈ సిరీస్ మే 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌..
ది మప్పెట్స్‌ మేహెమ్‌ (వెబ్‌సిరీస్‌)- మే 10
స్వప్న సుందరి (తమిళ/తెలుగు) -మే 12

జీ5..
తాజ్‌: ది రీన్‌ ఆఫ్‌ రివెంజ్‌ (హిందీ సిరీస్‌-2)- మే 12

సోనీ లివ్‌..
ట్రాయాంగిల్‌ ఆఫ్ శాడ్‌నెస్‌ (హాలీవుడ్) -మే 12

బుక్‌ మై షో..
ఎస్సాసిన్‌ క్లబ్‌(హాలీవుడ్‌)- మే 10

జియో సినిమా..
విక్రమ్‌ వేద (హిందీ)- మే 12

అమెజాన్‌ ప్రైమ్‌..
ఎయిర్‌ (హాలీవుడ్)- మే 12

నెట్‌ఫ్లిక్స్‌..
రాయల్‌ టీన్‌: ప్రిన్సెస్‌ మార్గరెట్‌ (హాలీవుడ్)- మే 11
ఎరినీ (హాలీవుడ్‌)- మే 11
ది మదర్‌ (హాలీవుడ్‌)- మే 12
క్రాటర్‌ (హాలీవుడ్)- మే 12
బ్లాక్‌ నైట్‌ (వెబ్‌ సిరీస్‌) -మే 12

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×