BigTV English
Advertisement

Director Harish Shankar: భగత్ సింగ్ పై ‘బచ్చన్ ’ ఎఫెక్ట్..హరీష్ శంకర్ పై ట్రోలింగ్స్

Director Harish Shankar: భగత్ సింగ్ పై ‘బచ్చన్ ’ ఎఫెక్ట్..హరీష్ శంకర్ పై ట్రోలింగ్స్

Mr. Bachchan Flop effect on Pawan Kalyan Ustad Bhagath Singh movie: అసలే పీకల్లోతు కష్టాలలో ఉన్న ఆ దర్శకుడు ఐదేళ్లు గ్యాప్ ఇచ్చి ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసితో ఓ సినిమా చేశాడు. తీరా ఆ సినిమా విడుదలయ్యాక ఇప్పుడు ఆ దర్శకుడిపై జనం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అట్లా ఎట్లా తీశావు ఆ మూవీని అంటూ ఆ దర్శకుడికి చుక్కలు చూపిస్తున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్. ఆగస్టు 15న రవితేజ హీరోగా ‘మిస్టర్ బచ్చన్’ విడుదలయింది. బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుని చతికిల పడింది. విడుదలకు ముందు దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీపై తెగ హైప్ ఇచ్చారు. అసలే ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు మరో ఫ్లాప్ ను అందించాడని రవితేజ అభిమానులు హరీష్ పై ఫైర్ అవుతున్నారు.


యావరేజ్ రివ్యూలు

మీడియా జనం ఏక పక్షంగా ఈ మూవీకి యావరేజ్ రివ్యూలే ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో ఈ మూవీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేం సినిమా? సినిమాను ఇలా కూడా తీస్తారా? రవితేజతో ఒకప్పుడు షాక్ చిత్రం తీసిన హరీష్ శంకర్ ఇప్పుడు నిజంగానే మిస్టర్ బచ్చన్ మూవీ ఫ్లాప్ తో షాక్ ఇచ్చాడు అని ట్రోలింగులు మొదలుపెట్టేశారు. వాస్తవ సంఘటనలను బేస్ చేసుకుని బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో తీసిన రైడ్ మూవీకి రీమేక్ గా రూపొందించారు హరీష్. అయితే రైడ్ ఛాయలు లేకుండా అచ్చ తెలుగు సినిమా అనుకోవాలని హరీష్ శంకర్ తన మాస్టర్ ప్లాన్ తో స్టోరీని మొత్తం మార్చేశాడు. పైగా సినిమాలో బలవంతంగా వచ్చే కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులకు విసుగుపుట్టించాడని అంటున్నారు. హరీష్ నవ్విద్దామని అనుకుని తానే నవ్వులపాలయ్యాడని అంటున్నారంతా.


‘షాక్’ ఇచ్చిన అభిమాని

మూవీలో ఆదాయ పన్ను శాఖ అధికారులను ఏదో చిన్న తరహా కుటీర పరిశ్రమ పెట్టుకున్నవారిగా చూపించాడు హరీష్ శంకర్. ల్యాగింగ్ సన్నివేశాలతో సినిమాను నడిపించేశాడు. రవితేజ ఎనర్జీని కూడా ఏ మాత్రం ఉపయోగించుకోలేకపోయాడు అని ట్రోలింగులు మొదలుపెట్టేశారు. అయితే ఓ నెటిజన్ మాత్రం హరీష్ శంకర్ ను ట్విట్టర్ లో ‘సార్ మీరు రివ్యూలను ఏమీ పట్టించుకోకండి..సినిమా బాగానే ఉంది..తప్పకుండా అందరూ మీ సినిమాను చూస్తారు‘ అని కామెంట్ పెట్టగానే హరీష్ శంకర్ ఆ అభిమానికి థాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. మళ్లీ అదే అభిమాని నేనేదో సరదాకి అలా అన్నాను మీరు నిజమని నమ్మేశారు అని హరీష్ శంకర్ కు షాక్ ఇస్తూ మరో కామెంట్ పెట్టాడు. ఇదంతా చూసి నెటిజన్స్ నవ్వుకుంటున్నారు.

ఆగిపోనున్న ఉస్తాద్

ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ తో పాటు విడుదలైన డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ మూవీలు కూడా యావరేజ్ టాక్ నే తెచ్చుకున్నాయి. కాకపోతే డబుల్ ఇస్మార్ట్ మూవీ మాత్రం మిస్టర్ బచ్చన్ మీద కాస్త ఫరవాలేదని టాక్ తెచ్చుకోవడంతో రామ్, పూరీ అభిమానులు సంతోషిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసి పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్ సైతం విడుదల చేశారు హరీష్ శంకర్. అది ఇంకా పట్టాలే ఎక్కలేదు. పైగా పవన్ కళ్యాణ్ మంత్రిగా బిజీగా ఉండటంతో అసలు ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందా? ఉండదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ ఎఫెక్ట్ తో పూర్తిగా పవన్ సినిమా ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. బచ్చన్ తో హరీష్ కు కష్టాలు వచ్చెన్ అని కామెంట్స్ చేస్తున్నారంతా..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×