BigTV English

Father of Agni Missiles R.N. Agarwal: ప్రముఖ అగ్ని క్షిపణి రూపకర్త రామ్ నరైన్ అగర్వాల్ కన్నుమూత

Father of Agni Missiles R.N. Agarwal: ప్రముఖ అగ్ని క్షిపణి రూపకర్త రామ్ నరైన్ అగర్వాల్ కన్నుమూత

Father of Agni Missiles R.N. Agarwal passes away: భారత్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పెస్ ఇంజనీర్, అగ్ని క్షిపణి రూపకర్త రామ్ నరైన్ అగర్వాల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ లో ఉన్న స్వగృహంలో మృతి చెందారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో రామ్ నరైన్ జన్మించారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.


1983లో ప్రారంభమైన అగ్ని క్షిఫణి ప్రోగ్రాంలో నరైన్ చేరారు. ఈ క్షిపణిని భారత క్షిపణుల్లో మణిహారంగా పేర్కొంటారు. ఈ మిషన్‌కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్ గా పనిచేయడంతోపాటు అగ్ని క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్ అని పిలుస్తుంటారు.

అదే విధంగా ఆయన ప్రోగ్రాం డైరెక్టర్ గా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లాబొరేటరీ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రోగ్రామ్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఆయన 33 ఏళ్ల క్రితం 1989 మే22న తన బృందంతో కలిసి 1000 కిలోల పేలోడ్‌తో 800 కి.మీ పైగా అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. అలాగే ఈ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్‌లోని చండీపూర్ లో ప్రయోగించారు.


రామ్ నరైన్ చేసిన సేవలకు భారత ప్రభుత్వం 1990లో పద్మ శ్రీ, 2000లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. శనివారం మధ్యాహ్నం సంతోష్‌నగర్‌లోని నివాసం నుంచి రామ్ నరైన్ అంతిమయాత్రం ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Also Read: ప్రోటోకాల్ ఉల్లంఘన!.. రాహుల్ గాంధీకి అవమానం

ఇదిలా ఉండగా, అగ్ని క్షిపణుల అభివృద్ధి, ప్రయోగాల్లో రామ్ నరైన్ అగర్వాల్ కీలకపాత్ర పోషించారని డీఆర్డీఏ మాజీ డైరెక్టర్ సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఆయన దేశ వ్యాప్తంగా పలు చోట్ల క్షిపణి ప్రయోగాల లాంచ్ పాడ్స్ రూపకల్పనలోనూ కీలకంగా పనిచేశారన్నారు. రామ్ కృషితోనే భారత్ రక్షణరంగంలో చాలా ముందుందన్నారు.

Related News

Cloud Burst: అసలు క్లౌడ్ బరస్ట్ ఏంటి..? దీనికి గల కారణాలేంటి..?

Gold In Odisha: ఒడిషాకు ‘బంగారు’ పంట.. నాలుగైదు జిల్లాల్లో బంగారం గనులు

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

Rahul Gandhi: ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్

National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!

Rare disease: హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి.. పాపం చిన్నారి మృతి.. బీ అలర్ట్!

Big Stories

×