MR Bachchan: పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మొదలుపెట్టిన హరీష్ శంకర్.. పవర్ స్టార్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ప్రస్తుతానికి ఆ మూవీని పక్కన పెట్టేసి రవితేజ తో కొత్త మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి టైటిల్ ని కూడా రీసెంట్ గా పోస్టర్ వేసి మరీ వెరైటీగా అనౌన్స్ చేశారు. మిస్టర్ బచ్చన్ అనే క్యాచీ క్లాస్ టైటిల్ తో మాస్ మహారాజ్ ఇరగదీసే లుక్స్ తో ఉన్న ఆ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.
ఇక హరీష్ శంకర్ ఈ మూవీని జట్ స్పీడ్ తో పూర్తి చేయాలి అని భావిస్తున్నట్లు టాక్. అందుకే టైటిల్ ని అనౌన్స్ చేయడం దగ్గర నుంచి షూటింగ్ కార్యక్రమాలు షుగరు చేయడం వరకు అన్ని చకచక జరిగిపోయాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఒక రూమర్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. మిస్టర్ బచ్చన్ అనే మూవీ హిందీ హిట్ మూవీకి రీమేక్ అనేది ఆ టాక్. ఈ మూవీకి సంబంధించిన రీమేక్ చర్చలు ఐదేళ్ల క్రితమే జరిగాయట.
ఇటు హరీష్ శంకర్ ఎన్నికల అయిన వెంటనే పవన్ తో సినిమా మొదలు పెట్టాలి ..అంటే ఈలోపే రవితేజతో చిత్రం పూర్తి కావాలి. ఈ నేపథ్యంలో రీమేక్ మూవీ అయితే ఎంతో స్పీడ్ గా పూర్తి అవుతుందన్న ఉద్దేశంతో ఒకప్పటి హిందీ హిట్ మూవీ.. రైడ్ ను ఇప్పుడు రవితేజతో రీమేక్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది.
నిజానికి రైడ్ మూవీ హిందీలో విడుదలైనప్పుడే ఈ చిత్రాన్ని తెలుగులో రవితేజతో రీమేక్ చేస్తారని పుకారు వచ్చింది. అయితే అందరూ అనుకున్నట్టు అప్పుడు ఈ రీమేక్ మూవీ పట్టాలు ఎక్కలేదు. ఫైనల్ గా ఇన్నేళ్లకు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో ఆ మూవీ రీమేక్ షురూ అయింది. ఈ విషయం రైడ్ హిందీ మూవీ హీరో అజయ్ దేవగన్.. రవితేజ మిస్టర్ బచ్చన్ పోస్టర్ ను షేర్ చేసి విష్ చేయడంతో కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
రైడ్ మూవీ స్టోరీ రవితేజ బాడీ లాంగ్వేజ్ కి.. ఇమేజ్ కి బాగా సెట్ అవుతుందని అంటున్నారు అతని అభిమానులు. మొత్తానికి ఈ సినిమా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో విడుదలయ్యాకే తెలుస్తుంది.