BigTV English
Advertisement

Samantha : స్టేజ్ ఎక్కి మరీ డాన్స్ చేసిన సమంత .. ఏక్ దమ్ టాప్ అంటున్న అభిమానులు..

Samantha : స్టేజ్ ఎక్కి మరీ డాన్స్ చేసిన సమంత .. ఏక్ దమ్ టాప్ అంటున్న అభిమానులు..

Samantha : స్టార్ హీరోయిన్ సమంత.. ప్రేక్షకుల ముందుకి ఖుషి అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చి పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ సంవత్సరం సినిమాలకు బ్రేక్ చెప్పి, షూటింగ్స్ కి దూరంగా ఉంటూ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఈ టైం తన ఆరోగ్యం పై దృష్టి పెట్టడానికి వాడుకుంటున్నానని సమంత చెప్పిన విషయం తెలిసిందే. సినిమాలకి దూరంగా ఉంది కానీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా తనకు సంబంధించిన డీటెయిల్స్ ను అభిమానులతో పంచుకుంటూనే ఉంది.


తాజాగా సమంత ఎంటీవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు సందడి చేయడానికి రాబోతోంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఎంటీవీ టాలెంట్ షో.. హసల్‌ 03 కి సమంత గెస్ట్ గా హాజరయ్యింది. ఇక తన రేంజ్ అల్లరి చేస్తూ కంటెస్టెంట్స్ కి జోష్ ఇవ్వడానికి ప్రయత్నించింది. అంతేకాదు స్టేజి ఎక్కి మరీ డాన్స్ చేసి అక్కడున్న అందరిని సమంత ఆశ్చర్యపరిచింది. ఈ టాలెంట్ షో కి సంబంధించిన తాజా ఎపిసోడ్ ప్రోమో ను ఎంటీవీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సమంత చాలా కొత్తగా.. ఎంతో యాక్టివ్ గా కనిపిస్తోంది. 

వీడియోతో పాటుగా సమంత రాకతో ఈ వారం ఏక్‌ధమ్‌ టాప్.. అన్న క్యాప్షన్ కి ఒక ఫైర్ ఎమోజిని కూడా ట్యాగ్ చేశారు. ఈ వీడియోలో సమంత రచ్చ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అయింది. ఇంతకుముందు కూడా సమంత పలు షో లకు జడ్జ్‌ గా వ్యవహరించింది. అయితే తాజాగా ఈ షోలో కొత్త సంబంధాన్ని చూస్తున్నామంటూ అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత నటించిన వెబ్ సిరీస్ సెటడిల్ కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. వచ్చే సంవత్సరం సమంత కొత్త సినిమాలు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందని టాక్.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×