BigTV English

Morning Drinks : ఈ డ్రింక్స్‌తో సూపర్ బెనిఫిట్స్..!

Morning Drinks : ఈ డ్రింక్స్‌తో సూపర్ బెనిఫిట్స్..!

Morning Healthy Drinks : ఉదయాన్నే నిద్రలేవగానే కొందరు టీ, కాఫీలు తాగేస్తుంటారు. ఉదయాన్నే మన శరీరం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కాబట్టి ఏది పడితే అది తాగడం కన్నా.. కొన్ని రకాలు జ్యూస్‌లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయి. ఈ జ్యూస్‌లు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటుగా తీసుకోవాలి. అవేంటో అలస్యం చేయకుండా చూసేద్దాం.


టమోటా రసం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టమోటా రసం అంటువ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం కంటెంట్ శరీరంలో వాపును తగ్గిస్తుంది. తాజా టమోటాలతో జ్యూస్ చేసుకొని రోజూ తాగండి. ఇందులో విటమిస్ సి, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టమోటా రసంలో చిటికెడు నల్ల ఉప్ప కలిపితే ఇంకా మంచిది.

Read More : ఈవినింగ్ 7 తర్వాత ఇవి చేయండి..!


ఉదయాన్నే ఓ గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగండి. ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి శరీరాన్ని తట్టుకునేలా చేస్తాయి. అలానే ఆరెంజ్ జ్యూస్‌లో ఉండే విటమిస్ సి కంటెంట్ శరీరంలో మంచి లక్షణాలను ప్రోత్సహిస్తుంది. ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల మీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది.

ఉదయాన్నే దోసకాయ, బచ్చలికూర జ్యూస్ తాగడం వల్ల కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ దోసకాయ బచ్చలికూర రసంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దోశకాయ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. బచ్చలిరూర రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ రసంలో విటమిన్, కె, సి, ఎ, పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు ఉంటాయి.

బీట్‌రూట్, క్యారెట్, ఆపిల్‌ కలిపి చేసిన జ్యూస్‌తో మీ రోజును ప్రారంభించండి. బీట్‌రూట్ మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యారెట్ కంటికి చాలా మంచిది. బీటా కెరోటిన్ సరఫరా అవుతుంది. యాపిల్‌లో విటమిస్ సి, ఫైబర్ ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల మీ శరీరానికి మంచి బూస్ట్ లభిస్తుంది. బీట్‌రూట్, క్యారెట్, ఆపిల్‌లో బి-6, ఐరన్‌లు నిండుగా ఉంటాయి.

Read More : ఇవి తింటే 30 రోజుల్లో బరువు తగ్గుతారు..!

ఉదయాన్నే బచ్చలికూర జ్యూస్ తీసుకోవడం వల్ల మీ మంచి పోషకాలు అందుతాయి. ఈ జ్యూస్ A, B , C విటమిన్లు ఉంటాయి. ఇవి మన శరీరంలో యాంటీబాడీ ఉత్పత్తిని పెంచుతాయి. శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియాలు శీరీరంలో కణాల విస్తరణకు తోడ్పడతాయి.

యాపిల్, క్యారెట్, నారింజ జ్యూస్‌ ఉదయాన్నే మంచి రిఫ్రెష్‌ను ఇస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ప్రయోజనాలను కూడా శరీరానికి అందిస్తుంది. ఈ జ్యూస్ పేగుల కదలికలను కూడా నియంత్రిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ, ఫాస్పరస్, ఫైబర్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×