Sricharan pakala : ఫిలిమ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ కు పేరు రావడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ, అలానే గుర్తుండిపోయే మ్యూజిక్ ఇస్తే కానీ కొందరి మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు గుర్తు ఉండవు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దేవి శ్రీ ప్రసాద్, మణిశర్మ, తమన్ వంటి సంగీత దర్శకులు పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి. చాలామంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా సినిమాలు కూడా చేశారు. కానీ వాళ్లకు సరైన గుర్తింపు రాలేదు. తెలుగు సంగీత దర్శకుల పేర్లు పెద్దగా గుర్తు ఉండకపోయినా అనిరుధ్ లాంటి తమిళ సంగీత దర్శకుల పేర్లు గుర్తు ఉండటానికి కారణం వాళ్ళు ఇచ్చే మ్యూజిక్. అభివృద్ధి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నది.
12 ఏళ్లకు బ్రేక్ వచ్చింది
2013లో విడుదలైన ‘కిస్’ అనే సినిమాకు సంగీత దర్శకుడుగా పనిచేశాడు శ్రీ చరణ్ పాకాల. ఆ తర్వాత తాను సంగీత దర్శకుడుగా పనిచేసిన కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలో యాక్టింగ్ కూడా చేశాడు. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు పేర్లు చెబితే ఈ సినిమాలకి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ చేశాడా అని ఆశ్చర్యం కలుగుతుంది. కానీ సెపరేట్గా ఈయన మ్యూజిక్ గుర్తుండే దాఖలాలు లేవు. సిద్దు జొన్నలగడ్డ నటించిన డిజె టిల్లు సినిమా కొంతమేరకు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ అదే సినిమాలో టైటిల్ సాంగ్ రామ్ మిర్యాల పాడడంతో తనకు మంచి క్రెడిట్ వెళ్లిపోయింది. ఇక రీసెంట్ గా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన భైరవం సినిమా మ్యూజిక్ బయట గట్టిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి బయట చర్చించడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ సినిమా చరణ్ కు బ్రేక్ ఇచ్చింది అని చెప్పాలి.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకంగా
ఇక శ్రీ చరణ్ పాకాల విషయానికొస్తే చాలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. శేష్ అడివి నటించిన క్షణం, గూడచారి, ఎవరు వంటి సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కానీ ఈ సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్ స్ట్రాంగ్ గా ఉండటం వలన ఎవరు మ్యూజిక్ ని అంతగా పట్టించుకోలేదు. ఏదేమైనా ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా భీమ్స్, శ్రీ చరణ్ పాకాల, చరణ్ అర్జున్ వంటి సంగీత దర్శకులు ఈ మధ్యకాలంలోనే పేరు సంపాదించడం మొదలుపెట్టారు. ఇక శ్రీ చరణ్ పాకాల విషయానికి వస్తే ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం సినిమా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కి మంచి పేరు వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.