Paramapada Sopanam: అర్జున్ అంబటి (Arjun Ambati) పరిచయం అవసరం లేని పేరు. పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అర్జున్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అర్జున్ హీరోగా ఇప్పటికే అర్ధనారి, తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్ వంటి సినిమాలలో ఎంతో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాల తర్వాత అర్జున్ బుల్లితెర సీరియల్స్, బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అదేవిధంగా బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు. ఇక బిగ్ బాస్ తర్వాత అర్జున్ సీరియల్స్ చేయకపోయినా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.
భూమ్ భూమ్ …
ఇక ప్రస్తుతం అర్జున్ నటిస్తున్న సినిమాలలో “పరమపద సోపానం” (Paramapada Sopanam) ఒకటి. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటూ జూలై 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇలా ఒకవైపు షూటింగ్ పనులు జరుగుతూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీతో పాటు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేశారు.భూమ్ భూమ్(Boom Boom) అంటూ సాగిపోయే ఈ రెండో పాటను తాజాగా యూట్యూబ్ ఛానల్ వేదికగా విడుదల చేశారు.
మాంచి ఊపున్న సాంగ్..
ఈ అద్భుతమైన పాటను సింగర్ గీతామాధురి ఆలపించగా, రాంబాబు గోశాల సాహిత్యం అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక ఈ పాట గురించి గీతామాధురి మాట్లాడుతూ ఈ పాటను తాను చాలా ఎంజాయ్ చేస్తూ పాడానని, ఇది మంచి ఊపున్న పాట కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని మంచి సక్సెస్ అవుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “చిన్ని చిన్ని తప్పులేవో” అనే సాంగ్ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకొని సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో అర్జున్ సరసన జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ అద్భుతమైన చిత్రానికి నాగ శివ దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈయన ఇదివరకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమాకి నాగ శివ స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వ బాధ్యతలను కూడా తీసుకున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్ ఎస్ మీడియా సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా గుడిమిట్ల ఈశ్వర్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా ద్వారా సంగీత దర్శకుడుగా సక్సెస్ అందుకున్న డేవ్ జాండ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా ఈశ్వర్, పబ్లిసిటీ డిజైనర్ గా కృష్ణ ప్రసాద్ తదితరులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.