BigTV English

Vaibhav Suryavanshi – Modi : అదృష్టం అంటే 14 ఏళ్ల వైభవ్ దే… ఏకంగా మోడీ తోనే

Vaibhav Suryavanshi – Modi : అదృష్టం అంటే 14 ఏళ్ల వైభవ్ దే… ఏకంగా మోడీ తోనే

Vaibhav Suryavanshi – Modi : రాజస్థాన్ రాయల్స్ జట్టులో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఆడిన విషయం తెలిసిందే. అతను భారతీయ క్రికెటర్ల రికార్డులను బ్రేక్ చేశాడు. తన తొలి సీజన్ లోనే ఔరా అనిపించాడు. అతను ఆడిన 7 మ్యాచ్ ల్లోనే 252 పరుగులు చేసాడు. ఇందులో ఒక రికార్డు సెంచరీ కూడా ఉంది. జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండో సెంచరీ కావడం విశేషం. అత్యంత వేగవంతమైన రెండో సెంచరీ బాదిన క్రికెటర్ గా, అతి పిన్న వయస్కుడిగా రికార్డులు నెలకొల్పాడు. ఆ మ్యాచ్ లో మొత్తంగా38 బంతుల్లో 101 పరుగులు చేసాడు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే వైభవ్ సూర్యవంశీ తన ఆటతీరుతో ఎంతో పరిణతి ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.


Also Read : RCB vs PBKS: ఫైనల్స్ కు చేరిన RCB.. బట్టలు విప్పేసిన హాట్ బ్యూటీ ?

తాజాగా వైభవ్ సూర్యవంశీ భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశాడు.  ఈ యువ క్రికెటర్ ప్రధాని మోడీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు.  మరోవైపు ప్రధాని మోడీ యువ క్రికెటర్ ని కలిసినట్టు ఓ ట్వీట్ కూడా చేశాడు. ” నేను సంచలన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, అతని కుటుంబాన్ని పాట్నా ఎయిర్ ఫోర్టులో కలిశాను. యావత్ భారతావని అతని క్రికెట్ నైపుణ్యాలను ప్రశంసిస్తోంది. అతని భవిష్యత్ గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తున్నా” అని ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రధాని చేసిన ట్విట్టర్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక ఇటీవలే ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో ఈ టీనేజ్ క్రికెటర్ ఐపీఎల్ లో సాధించినటువంటి అద్భుతాల గురించి ప్రశంసించాడు.


ఐపీఎల్ లో.. బీహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటతీరును చూశానని.. అంత చిన్నవయస్సులో వైభవ్ గొప్ప రికార్డును సృష్టించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన వెనుక అతని కఠోర శ్రమ దాగి ఉంది అని ప్రధాని మోడీ అభినందించారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ తన ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి వివిధ స్థాయిల్లో అనేక మ్యాచ్ లు ఆడాడు. మీరు ఎంత ఎక్కువగా ఆడితే అంత ఎక్కువగా ప్రకాశిస్తారు. వీలైనంత ఎక్కువ మ్యాచ్ ఆడటం, పోటీలలో పాల్గొనడం చాలా ముఖ్యమని.. మా ప్రభుత్వం ఎప్పుడూ యువ క్రీడాకారులకు అండగా ఉంటుందని ప్రధాని మోడీ యువకుల్లో క్రీడాభిరుచుని ప్రోత్సహించేలా ప్రసంగించారు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు  14 మ్యాచ్ లు ఆడితే.. అందులో కేవలం 4 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్ ల్లో గెలుపు దగ్గరికీ చేరుకొని ఓటమి పాలైంది. 10 మ్యాచ్ ల్లో ఓడిపోవడం విశేషం. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 09వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో ఓటమిలు కాస్త ఎక్కువ అనే చెప్పాలి. ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఎల్లుండి పంజాబ్ కింగ్స్ తో క్వాలిఫయిర్ 2లో తలపడనుంది. 

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×