
Thaman s Birthday : తమన్.. ప్రజెంట్ టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు ఏవి వచ్చినా చాలా వరకు ఈ పేరు మారుమోగుతుంది. దీంతోపాటుగా మీమర్స్.. ఈ సాంగ్ అక్కడ కాపీ కొట్టావు.. ఈ టూన్ ఇందులోది.. అంటూ టెడ్డీ అన్నను బాగా పాపులర్ చేశారు. తమన్ నవంబర్ 16,1983లో నెల్లూరు జిల్లాలో జన్మించాడు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర తమన్ తండ్రి అశోక్ కుమార్ డ్రమ్ములు వాయించేవారు. తమన్ తల్లి సావిత్రి ప్రముఖ నేపథ్య గాయని. అలా తమన్ ఫ్యామిలీలోని సంగీతం కలిసిపోయింది.
తమన్ అసలు పేరు గంటసాల సాయి శ్రీనివాస్ తమన్. ప్రముఖ దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య గారి కి తమన్ మనవడు అవుతాడు.చిన్నతనం నుంచి సంగీతం మధ్య పెరగడంతో తమన్ అడుగులు కూడా మ్యూజిక్ వైపే పడ్డాయి. ఆరేళ్ల చిరుప్రాయానికి డ్రమ్ములు వాయించడం మొదలుపెట్టారు తమన్. తన తండ్రి విదేశాల నుంచి తెచ్చిన డ్రమ్మును ఉపయోగించి చుట్టుపక్కల జరిగే పండుగలో డ్రమ్ము వాయించేవాడు.
13 సంవత్సరాలకే తండ్రిని పోగొట్టుకున్న తమన్.. కుటుంబ బాధ్యత నెత్తిన పడడంతో..సంగీతం మీద ఉన్న మక్కువతో.. చిన్న వయసులోనే డ్రమ్మర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు.. అలా మెల్లిగా ఒక్కొక్క అడుగు పైకెక్కుతూ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోగలిగాడు. రోజుకు 30 రూపాయ ల జీతానికి తమన్ డ్రమ్మర్ గా పనిచేసిన రోజులు ఉన్నాయి.ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా రాణిస్తున్నాడు.
బాయ్స్ సినిమా సమయంలో డ్రమ్ వాయించడానికి ఒక కుర్రవాడి అవసరం ఉండడంతో ఏఆర్ రెహమాన్ డ్రమ్మర్ గా అందరికీ పరిచయం ఉన్న తమన్ ను శంకర్ కి ఇంట్రడ్యూస్ చేశాడు. అలా తమన్ కు బాయ్స్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మణిశర్మ తెరకెక్కించే మహేష్ బాబు ఒక్కడు చిత్రం తమన్ లైఫ్ కి మంచి టర్నింగ్ పాయింట్. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్గా కిక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన తమన్ ఆ తర్వాత స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేశాడు. ఈ సంవత్సరం బాలకృష్ణ సెన్సేషనల్ హిట్స్ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మూవీస్ కు తమన్ మ్యూజిక్ సమకూర్చాడు. ఇక మహేష్ బాబు గుంటూరు కారం తో సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాడు. దీనితో పాటుగా పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ లాంటి పలు క్రేజీ మూవీస్ తమన్ ఖాతాలో ఉండనే ఉన్నాయి.
క్రేజీ మ్యూజిక్ ని అందిస్తూ అందరిని ఉల్లాసపరిచే తమన్ కు బిగ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
C/O Atakaram: C/O Aటకారం