Atlee multi-starrer :నార్త్ తో సౌత్ జోడీ.. అట్లీ తో అట్లుంటది మరి..

Atlee multi-starrer :నార్త్ తో సౌత్ జోడీ.. అట్లీ తో అట్లుంటది మరి..

Atlee multi-starrer
Share this post with your friends

Atlee multi-starrer

Atlee multi-starrer : అట్లీ.. టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. ఇలా ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న డైరెక్టర్. షారుక్ ఖాన్ కి జవాన్ లాంటి మంచి హిట్ అందించి బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేర్ చేశాడు అట్లీ. షారుక్ ఖాన్ స్టార్ డ‌మ్ కు.. అట్లీ ఇచ్చిన మాస్ ఎలివేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. షారుక్ క్రేజీ లుక్..మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ తో ఈ మూవీ సునాయాసంగా 700 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో షారుఖ్ తిరిగి అట్లీతో మూవీ మళ్లీ ఎప్పుడు చేస్తాడో అని అతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

అయితే షారుక్..అట్లీ కాంబోలో మూవీ కి అంకురార్పణ జవాన్ సెట్స్ లోనే డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే అట్లీ ఈసారి షారుక్.. ఇళయ దళపతి విజయ్ ని కలిపి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం మూవీకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్టు అట్లీ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు. గత కొద్ది కాలంగా ఈ కాంబినేషన్లో మూవీ రాబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. అట్లు మాత్రం మౌనంగానే ఉన్నాడు. ఇన్నాళ్ళకి ఆ మౌనానికి బ్రేక్ ఇచ్చి అసలు విషయం ఓపెన్ అయ్యాడు.

చెన్నైలో జిందా బందా సాంగ్ షూటింగ్ జరిగే సమయంలో పార్టీకి విజయ్ ని కూడా అట్లీ ఆహ్వానించాడు. అదే సమయంలో షారుక్ విజయ్ చాలా సేపు కలిసి మాట్లాడుకోవడం.. ఆ తర్వాత ఇద్దరు హీరోలతో సినిమా చేయాలంటే మేము రెడీ అని చెప్పడం తో అఖిల్ షాక్ అయ్యాడట. ఎప్పటినుంచో మల్టీ స్టార్లర్ తీయాలి అని అనుకుంటున్నా అట్లీకి షారుక్తో పాటుగా తను అన్నగా భావించే విజయ్ కూడా ఒప్పుకోవడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

 ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్లో.. అది కూడా తన డైరెక్షన్ లో.. తలచుకొని ఖుష్ అయిన అట్లీ వెంటనే స్టోరీ పనులు మొదలుపెట్టాడు.ఇద్దరు స్టార్ హీరోలే.. వాళ్లకంటూ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ఉంది. అందుకే ఇద్దరికీ తగినట్టుగా కథ ఉండేలా అట్లీ ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. నేను చేసే నెక్స్ట్ మూవీ అదే అయ్యే ఛాన్స్ ఉంది అంటూ అట్లీ అందరిని సర్ప్రైజ్ చేశాడు. మరి ఇద్దరి హీరోల కాంబోలో వచ్చు మూవీ ఎలా ఉంటుందో చూడాలి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

DK Shivakumar : డీకే వెనక్కి తగ్గారా..? అందుకే ఢిల్లీకి వెళ్లారా..?

BigTv Desk

TDP : గుంటూరు తొక్కిసలాట దుర్ఘటనపై మాటల యుద్ధం.. తప్పెవరిది..?

Bigtv Digital

Telangana Elections : నామినేషన్ వేసేందుకు వస్తే.. అడ్డుకున్న పోలీసులు.. అతడు ఏం చేశాడంటే?

Bigtv Digital

Kohli-Rahul : కోహ్లి, రాహుల్ మెరుపులు.. భారత్ శుభారంభం.. ఆసీస్ పై గ్రాండ్ విక్టరీ..

Bigtv Digital

Kerala Stampede : కేరళలో తొక్కిసలాట.. నలుగురు మృతి.. 50 మందికి గాయాలు

Bigtv Digital

Karnataka: సిద్ధుకే ఛాన్స్!.. డీకేకు మిస్!.. పవర్‌గేమ్ ఎండ్!..

Bigtv Digital

Leave a Comment