E-Paper
Advertisement

Dragon Movie Event : తమిళ్ యంగ్ హీరోతో సినిమాను చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్

Dragon Movie Event : తమిళ్ యంగ్ హీరోతో సినిమాను చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్
Advertisement

Dragon Movie Event : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలుగా ప్రస్తానాన్ని మొదలుపెట్టింది ఈ సంస్థ. అతి తక్కువ కాలంలోనే మంచి క్వాలిటీ సినిమాలు చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. చాలామంది స్టార్ హీరోలతో ఈ ప్రొడక్షన్ హౌస్ సినిమాలను నిర్మించింది. అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ మినహాయిస్తే మిగతా స్టార్ హీరోలు అంతా కూడా ఈ బ్యానర్ లో సినిమాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ బ్యానర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ బ్యానర్ నుంచి వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ ప్రభంజనం చూపించింది. దీంతో పుష్ప త్రీ సినిమా మీద కూడా అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమా కేవలం సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా మరోవైపు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్న విషయం తెలిసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా ఈ బ్యానర్ ప్రూవ్ చేసుకోవాలని సిద్ధమైంది. ఇదివరకే అజిత్ తో తమిళ్ లో సినిమాను కూడా చేశారు.  ప్రదీప్ రంగనాథన్ హీరోగా మరో సినిమాను చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు నిర్మాత రవి శంకర్. అయితే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా 20 రోజుల వరకు అయిపోయిందట. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. సినిమా టైటిల్ ని కూడా త్వరలో రివిల్ చేయనున్నారు. ఇది ఒక అద్భుతమైన కథ అంటూ తెలిపారు.

Advertisement

తెలుగులో కూడా భారీ ప్రాజెక్ట్స్ ను నిర్మిస్తుంది ఈ సంస్థ. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగిన బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. ప్రభాస్ హను సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కనిపించబోతుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సీతారామం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత హను దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి మంచి అంచనాలు మొదలయ్యాయి. సినిమాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ త్వరలో రానున్నాయి. చాలా ప్రొడక్షన్ హౌసెస్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లో కూడా తమ సత్తాను చాటుతున్నాయి. ఇక మైత్రి తమిళ్లో ఎంత మేరకు నిలబడుతుందో వేచి చూడాలి.

Also Read : Naga Vamsi – Siddhu Jonnalagadda : టిల్లు గాడి కొత్త సినిమా ఫిక్స్, నాగవంశీ చెప్పిన సందీప్ రెడ్డి వంగ టైప్ సినిమా ఇదేనా.?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×