Hero’s Lady Getups: పాత్ర డిమాండ్ చేస్తే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే పాత్రకు తగ్గట్టుగా మారిపోవాల్సిందే. అందులో ఒకటే లేడీ గెటప్. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ని మొదలుకొని అల్లు అర్జున్ (Allu Arjun) వరకు.. అలాగే వి.కె.నరేష్(VK.Naresh) ని మొదలుకొని, యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) వరకు ఇలా చాలామంది లేడీ గెటప్ లో చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక టాలీవుడ్ హీరోలు మాత్రమే కాకుండా సౌత్ హీరోలను మొదలుకొని నార్త్ లో బడా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా లేడీ గెటప్స్ తో అలరించారు. ఇకపోతే ఈ లేడీ గెటప్ అనేది అందరికీ సెట్ అవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. అలా ఇప్పటివరకు ఎంతోమంది లేడీ గెటప్ వే.శారు. మరి వారంతా ప్రేక్షకులను మెప్పించారా? ఎవరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
20 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి గెటప్స్..
ఒకప్పుడు లేడీ గెటప్ అంటే సీనియర్ హీరో నరేష్ (Naresh),చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్ (Venkatesh), బాలకృష్ణ (Balakrishna), మంచు మనోజ్ (Manchu Manoj) వంటి వారు లేడీ గెటప్స్ లో ఆకట్టుకున్నారు.ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన “పుష్ప 2” సినిమాలో గంగమ్మ జాతర పాటలో లేడీ గెటప్ లో ఆకట్టుకున్నారు అల్లు అర్జున్. అదే గెటప్ లో నర్తించి , ఫైటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది
ఇక ఈనెల 14వ తేదీన విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేస్తూ విడుదలైన చిత్రం ‘లైలా’. ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో అచ్చం అమ్మాయి లాగే కనిపించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి కూడా విశ్వక్ సేన్ లేడీ గెటప్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.
సందర్భానికి తగ్గట్టుగా సాహసం చేసిన హీరోలు..
చిరంజీవి..
ఇకపోతే చిరంజీవి ‘చంటబ్బాయి’ సినిమాలో “నేనో ప్రేమ పూజారి” అనే పాటలో హీరోయిన్ సుహాసిని (Suhasini) ను ప్రభావితం చేయడానికి పలు వేషాలు వేయగా.. అందులో అమ్మాయి గెటప్ కూడా ఒకటి. తనకున్న ఇమేజ్ కు భిన్నంగా మీసాలు తీసేసి మరీ చిరంజీవి చేసిన ఈ ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించింది. అంతేకాదు చిరంజీవి కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ఇందులో లేడీ గెటప్ లో గౌనుతో తలపై టోపీ పెట్టుకుని తళుక్కున మెరిసారు చిరంజీవి.
వీకే నరేష్..
ఈయన ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమాలో లేడీ గెటప్ తో అందరిని ఆకట్టుకున్నారు. సరిగ్గా 34 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పెళ్ళికాని కుర్రాళ్లకు ఎవరూ అద్దెకు ఇల్లు ఇవ్వని పరిస్థితుల్లో ఒక అబ్బాయి.. అమ్మాయిగా వేషం వేసుకొని తన మిత్రులకు కూడా ఆ వేశం వేయించి, ఒక ఇంట్లో అద్దెకు దిగడం, ఆ చిత్రంలోని అసలు కథాంశం .ఇక దాని చుట్టూ సాగిన నవ్వుల యాత్ర నిజంగానే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వీకే నరేష్ అచ్చం వాళ్ళ అమ్మ విజయనిర్మల (Vijay Nirmala) ను తలపించాడు అని పలువురు ప్రశంసించారు.
బాలకృష్ణ..
‘పాండురంగడు’ సినిమాలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొన్ని సెకండ్ల పాటు అమృత అనే లేడీ గెటప్ తో ఆకట్టుకున్నారు. టాలీవుడ్ హీరో అయిన ఈయన ఒక మహిళగా కనిపించి ఆ పాత్రతో మాయ చేసారు.
ఇక వీరే కాకుండా గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో మంచు మనోజ్(Manchu Manoj), మేడం సినిమాలో రాజేంద్రప్రసాద్(Rajendra Prasad), కితకితలు సినిమాలో అల్లరి నరేష్(Allari Naresh), అన్నర్వ మక్కళు సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్(Sivaraj kumar), వీడొక్కడే సినిమాలో ఒక పాటలు సూర్య(Suriya), మల్లన్న సినిమాలో విక్రమ్(Vikram), వాడే వీడు మూవీలో విశాల్(Vishal), రెమో లో శివ కార్తికేయన్(Siva Karthikeyan) , పనక్కరణ్ సినిమాలోని ఒక పాటలో రజనీకాంత్(Rajinikanth) , భామనే సత్యభామనే సినిమాలో కమలహాసన్(Kamal Hassan), ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాలో సుమంత్(Sumanth), డూప్లికేట్ లో షారుక్ ఖాన్(Shahrukh khan) , లావరిస్ లోని ఒక పాటలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). జానేమన్ లో సల్మాన్ ఖాన్(Salman Khan) , హమ్ షకల్స్ లో సైఫ్ అలీ ఖాన్(Saif AliKhan), ఖిలాడీలో అక్షయ్ కుమార్ (Akshay Kumar), రితేష్ దేశ్ ముఖ్ (Rithesh Deshmukh), ఆయుష్మాన్ ఖురానా (Ayushman Khurana) ఇలా ఎంతోమంది లేడీ గెటప్స్ తో ఆకట్టుకున్నారు.