Naga Vamsi – Siddhu Jonnalagadda : క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరియర్ మొదలు పెట్టిన సిద్దు జొన్నలగడ్డ, నేడు సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. కేవలం తనలోని నటుడిన మాత్రమే బయటకు తీయకుండా తనలో ఉన్న రచయితను కూడా బయటకు తీస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. సిద్దు జొన్నలగడ్డ సినిమా అంటేనే ఇప్పుడు మినిమం గ్యారంటీ ఉంటుందని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. సిద్దు ఎన్ని మంచి సినిమాలు చేసినా కూడా డిజె టిల్లు తీసుకువచ్చిన ఇమేజ్ ఇంకో సినిమా తీసుకురాలేకపోయింది. రీసెంట్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో సిద్దుకు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ అనే సినిమాను చేస్తున్నాడు సిద్దు. ఇదివరకే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆరెంజ్ సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు. ఇప్పుడు సిద్దు హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ సినిమా చేయడం అంటే అది అసలైన సక్సెస్ అని చెప్పాలి.
రీసెంట్ గా ఫిబ్రవరి 14న సిద్దు నటించిన ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రీ రిలీజై మంచి సక్సెస్ సాధించింది. కేవలం ఓటీటీ లో చూసిన ప్రేక్షకులు అంతా కూడా మరోసారి థియేటర్లో ఈ సినిమాను చూశారు. ప్రస్తుతం సిద్దు చేతిలో వరుస ప్రాజెక్టు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సిద్దు మరో సినిమాను చేయబోతున్నట్లు ఇదివరకే వార్తలు వినిపిస్తూ వచ్చాయి. గతంలో నాగ వంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను సిద్దుతో ఒక సినిమా అనుకుంటున్నాను. మేము అనుకున్న కథను అలాగా స్క్రీన్ పైకి తీసుకుని వెళ్ళగలిగితే ఇది ఒక సందీప్ రెడ్డి వంగా సినిమా లాగా అనిపిస్తుంది. సినిమా సక్సెస్ అయితే సందీప్ రెడ్డి వంగ లా తీశారు అని అనుకుంటారు. సినిమా ఫెయిల్ అయితే సందీప్ రెడ్డి వంగ లా తీయడానికి ట్రై చేసి ఫెయిలయ్యారు అని చెబుతారు అని అప్పట్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ తెలిపారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సిద్దుకి ఆల్రెడీ సబ్జెక్టు ఓకే అయిపోయినట్లు తెలుస్తుంది. ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమా దర్శకుడు రవికాంత్ పేరేపు ఒక కథను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే అప్పట్లో నాగ వంశీ చెప్పిన కథ ఇదే అని చాలామందికి నమ్మకం వచ్చేసింది. రవికాంత్ పేరేపు క్షణం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమా దర్శకుడుగా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన బబుల్గం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. అయితే సరిగ్గా చెప్పుకోదగ్గ హిట్ సినిమా అయితే రవికాంత్ కు పడలేదు. నాగ వంశీ చెప్పినట్లు, సిద్దుతో సినిమా వర్కౌట్ అయితే రవికాంత్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయినట్లే అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు గురించి సంబంధించిన అధికారికి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : RGV : ఏంది సామి ఇది.. నీ టాలెంట్ కు దండం పెట్టాలి.. చుక్కలు చూపిస్తున్నావ్..