E-Paper
Advertisement

Mythri Cinemas: మైత్రీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్.. ఎక్కడ, ఎప్పుడంటే?

Mythri Cinemas: మైత్రీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్.. ఎక్కడ, ఎప్పుడంటే?
Advertisement
Mythri Movie Makers
Mythri Movie Makers

Mythri Movie Makers: ఒక సినిమా కచ్చితంగా రిలీజ్ అవుతుందంటే అది హీరోపై అయినా, డైరెక్టర్‌పై అయినా లేదా నిర్మాణ సంస్థపై అయిన ప్రేక్షకుల్లో నమ్మకం ఉంటుంది. డైరెక్టర్ క్రియేటివిటీ చూసి కొందరు సినిమా హిట్ అవుతుందని ఫిక్స్ అవుతారు. మరికొందరెమో నిర్మాణ సంస్థను చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు. అలాంటి పేరు సంపాదించుకున్న ప్రముఖ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒకటి . ఈ సంస్థ ఒక సినిమాకు నిర్మాణం బాధ్యతలు తీసుకుంది అంటే ఆ సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కొందరు భావిస్తారు. ఎన్నో బడా సినిమాలను నిర్మించి అద్భుతమైన పేరును సంపాదించుకుంది ఈ సంస్థ.

Advertisement

ప్రస్తుతం వరుస సినిమాలతో ఈ నిర్మాణ సంస్థ బిజీ బిజీగా ఉంది. అయితే ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం ఇలా ఎన్నో భాషల్లో కూడా సినిమాలను నిర్మించి దూసుకుపోతున్నారు. ఇక నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన మొదట్లోనే బడా హీరోల సినిమాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంది.

Also Read: ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ డేట్ రివీల్ చేసిన నిర్మాత దిల్ రాజు.. ఫ్యాన్స్‌కు పూనకాలే

Advertisement

మహేశ్ బాబు శ్రీమంతుడు, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, రామ్ చరణ్ రంగస్థలం, అల్లు అర్జున్ పుష్ప వంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ కారణంగానే ఈ నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే హిట్టు పక్కా అని అభిప్రాయపడతారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ నిర్మాణ సంస్థ మరో అడుగు ముందుకేసింది.

ఇందులో భాగంగా ఓ మల్టీప్లెక్స్‌ని ఓపెన్ చేయడానికి సిద్ధమైంది. గుంటూరులో మైత్రి సినిమాస్ పేరుతో ఓ మల్లీప్లెక్స్‌ను ఓపెన్ చేయబోతున్నారు. మార్చి 29 అంటే రేపు ఈ మల్టీప్లెక్స్‌ను గ్రాండ్‌గా ఓపెన్ చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ వారు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

అందులో ఇటీవల రిలీజ్ అయిన, రిలీజ్ కాబోతున్న చిత్రాల పోస్టర్స్‌ను ఉంచారు. ఇకపోతే ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ వారు పలు బడా హీరోల సినిమాలను నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఉస్తాద్ భగత్‌సింగ్, అల్లు అర్జున్‌తో పుష్ప2, రామ్ చరణ్ ఆర్‌సి16 అండ్ ఆర్‌సి 17, ప్రభాస్ – హను రాఘవపూడి కాంబోలో ఓ మూవీని నిర్మించడానికి సిద్ధంగా ఉంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×