BigTV English

Erode MP Suicide : తమిళనాడులో విషాదం.. టికెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్య

Erode MP Suicide : తమిళనాడులో విషాదం.. టికెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్య

erode mp ganesamoorthy death news


Erode MP Ganesha Moorthy Suicide(Political news telugu): తనకు ఈసారి ఎంపీ టికెట్ కేటాయించలేదని మనస్తాపం చెందిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే నేత గణేశమూర్తి (77) ఆత్మహత్యాయత్నం చేసి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. మరికొద్దిరోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఈ విషాదకర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. గణేశమూర్తికి 2019 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో స్థానం దక్కింది. ఈరోడ్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన డీఎంకే గుర్తుపైనే పోటీ చేసి గెలిచారు.

అయితే తాజా లోక్ సభ ఎన్నికల్లో.. కూటమి సీట్ల సర్దుబాటులో టికెట్ ను ఎండీఎంకేకుతిరుచ్చి టికెట్ ఇచ్చింది. అక్కడి నుంచి దురైవైగోను అభ్యర్థిగా ప్రకటించింది. తనకు టికెట్ కేటాయించకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని గణేశమూర్తి మీడియాకు తెలిపారు. గణేశమూర్తిని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నామని, దురైవైగోకు ఎంపీ టికెట్ ఇవ్వడం ఆయనకు నచ్చకపోతే తనకు నచ్చింది చేసుకోవచ్చని ఎండీఎంకే అధిష్ఠానం తెలిపింది.


Also Read : పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ కేసు..

దాంతో గుర్తుమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మార్చి 24న విషపూరితమైన ట్యాబ్లెట్లను మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆయన్ను కోయంబత్తూర్ లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. నాలుగు రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. 5.05 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేశమూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెరుందురైలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

కాగా.. ఎంపీ గణేశమూర్తి 1947 జూన్ లో జన్మించారు. 1993లో ఎండీఎంకే పార్టీ ప్రారంభమవ్వగా.. నాటి నుంచీ ఆ పార్టీలోనే ఉన్నారాయన. 1998లో తొలిసారి పళని పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2009, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఈరోడ్ నుంచి పోటీ చేసి గెలిచారు.

Tags

Related News

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Big Stories

×