BigTV English

RR vs DC IPL 2024 Match Preview: గెలిచేది.. ఢిల్లీ రాజా ? రాజస్తాన్ రాజా?

RR vs DC IPL 2024 Match Preview: గెలిచేది.. ఢిల్లీ రాజా ? రాజస్తాన్ రాజా?

IPL 2024 RR vs DC Match Prediction preview


IPL 2024 RR vs DC Match Prediction preview(Latest sports news today): ఐపీఎల్ 2024 మ్యాచ్ లు ప్రారంభమైన ఐదురోజులకే గేర్ మారిపోయింది. సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రెండు కొదమ సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా మారిపోయింది మ్యాచ్…ఒకొక్కరు ఆడిన తీరు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఉప్పల్ స్టేడియంలో బాల్ తారాజువ్వలా లేచింది.

ఈ నేపథ్యంలో గురువారంనాడు జైపూర్ లో ఢిల్లీ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగనున్న మ్యాచ్ పై అందరి ఫోకస్ పడింది. ఒక మ్యాచ్ ఓటమిపాలైన ఢిల్లీ , ఒక మ్యాచ్ విజయం సాధించిన రాజస్తాన్ తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ తొలి మ్యాచ్ లో కాస్త నిరాశపరిచాడు. కానీ కీపర్ గా సక్సెస్ అయ్యాడు. ఒక స్టంపింగ్ కూడా చేశాడు.


ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌తో కూడిన పటిష్టమైన రాజస్తాన్ బౌలింగ్ ను పంత్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఇంతకుముందు అయితే ఎవరికి దిగులు లేదు. కానీ ఇప్పుడు ప్రమాదం బారిన పడి వచ్చాడు కాబట్టి, అందరి ద్రష్టి తనపైనే ఉంది.డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌  రాణించాలని సీనియర్లు సూచిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో వీరిద్దరికీ మంచి ఆరంభాలు దక్కినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో పంత్‌పై ఒత్తిడి పెరిగిందని అంటున్నారు.

Also Read: ముంబై వర్సెస్ రోహిత్ శర్మ.. 200 మ్యాచ్ లు

జైపూర్ సొంత మైదానం కావడం రాజస్తాన్ కి కలిసి వస్తుందని అంటున్నారు. పంజాబ్ కింగ్స్ ని ఓడించి మంచి ఊపులో రాజస్థాన్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ జోడీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి వీరు ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కెప్టెన్ సంజూ శాంసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తొలి మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్/నాండ్రే బర్గర్, ఆర్ అశ్విన్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్/కుమార్ కుషాగ్రా, అన్రిచ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

Related News

Hardik Pandya: ఒక‌టి కాదు రెండు కాదు, ఏకంగా 8 మందిని వాడుకున్న‌ హార్దిక్ పాండ్యా?

INDW vs AUSW: స్నేహ రాణా క‌ల్లుచెదిరే క్యాచ్‌…టీమిండియాకు మ‌రో ఓట‌మి.. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి ఆసీస్‌

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇక ర‌చ్చ ర‌చ్చే

Thaman: ముర‌ళీధ‌ర‌న్ ను మించిపోయిన త‌మ‌న్.. 24 ప‌రుగుల‌కే 4 వికెట్లతో తాండ‌వం

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Big Stories

×