E-Paper
Advertisement

Telangana Govt: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
Advertisement

Telangana Govt: పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై సోమవారం సుప్రీంకోర్టులో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పిటిషన్‌ని వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పిటిషన్ ను డిస్పోజ్ ఆఫ్  చేసినట్టుగా ప్రకటించారు సీజేఐ. రిట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.

Advertisement

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంలో వాదనలు

Advertisement

సోమవారం సుప్రీంకోర్టులో పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ట్రిబ్యునల్ ఇచ్చిన అనేక తీర్పులను ఏపీ ప్రభుత్వం ఉల్లఘించినట్టు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ ఉల్లంఘన కొనసాగిందని వివరించారు.

ఈ నేపథ్యంలో ఫ్లడ్ వాటర్ పేరుతో కొత్తగా ఏపీ ప్రభుత్వం 200 టీఎంసీలు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుని ప్రాథమిక దశలో అడ్డుకోకుంటే గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వాదనలు వినిపించారు. ఈ వాదనలపై సీజేఐ నోరు విప్పారు.

 పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

ఆర్టికల్ 32 ప్రకారం దాఖలు చేసిన రిట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉందన్నారు. సూట్ దాఖలు చేస్తే పరీవాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవచ్చని అన్నారు. దీనివల్ల గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలను ఇన్వాల్స్ చేసినట్టు అవుతుందన్నారు. అన్ని రాష్ట్రాల వాదనలు విని, తదుపరి విచారణ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

దీంతోపాటు ట్రిబ్యునల్ ఏ విధంగా చెప్పింది? మిగతా రాష్ట్రాలు ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తున్నాయి? వారు వినియోగించుకున్న విధానం సూట్ ద్వారా బయట పడుతుందన్నారు. ఆ విధంగా వెళ్తే ఉపయోగం ఉంటుందని, రిట్ పిటిషన్‌పై ఎలాంటి ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. రిట్ పిటిషన్ విచారణార్హత లేదని చెప్పడంతో దాన్ని వెనక్కి తీసుకుంది.

పిటిషన్‌‌ను తాము ఉపసంహరించుకుంటామని అభిషేక్ సింఘ్వి తెలిపారు. ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వాళ్లకు కేటాయించిన వాటర్ కంటే ఎక్కువ  వాడటానికి వీల్లేదని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో అనేక ఉల్లంఘనలకు ఏపీ ప్రభుత్వం పాల్పడిందని, ఆ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెస్తున్నట్లు చెప్పారు.

ALSO READ: తలసానికి బూస్ట్ ఇచ్చిందెవరు?

ఆనాడు అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడం లేదంటూ న్యాయస్థానం దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. ఏపీకి కేటాయించిన వాటర్ కంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి మౌళిక సదుపాయాలు క్రియేట్ చేస్తోందని, డీపీఆర్ ప్రిపరేషన్ మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు.

సీడబ్ల్యూసీ అనుమతి ఇవ్వలేదని, పూర్తిగా ఆ ప్రాజెక్టు ఆపాలని ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. గోదావరి, కృష్ణా నది జలాల విషయంలో నీటి హక్కులు కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని స్థాయిలో పోరాటం చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×