E-Paper
Advertisement

Naa Anveshana: సెలబ్రిటీల ముసుగులో మైనర్లపై లైంగికదాడులు.. అన్వేష్ సంచలన కామెంట్లు!

Naa Anveshana: సెలబ్రిటీల ముసుగులో మైనర్లపై లైంగికదాడులు.. అన్వేష్ సంచలన కామెంట్లు!
Advertisement

Naa Anveshana:ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ వ్లాగ్స్‌తో పాపులర్ అయిన ‘నా అన్వేషణ’ అన్వేష్, తాజాగా సామాజిక అంశాలపై చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ (Epstein Files) వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, మైనర్లపై జరుగుతున్న అకృత్యాల గురించి ఆయన చేసిన షాకింగ్ వెల్లడి ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేవలం విదేశాల్లోనే కాదు, మన దేశంలోని స్టార్ హోటల్స్‌లో కూడా ఇలాంటి దారుణాలు తాను స్వయంగా చూశానని ఆయన అనడం సంచలనం సృష్టిస్తోంది. వివరాలు ఇలా వున్నాయి..

స్టార్ హోటల్స్ ముసుగులో చీకటి దందాలు:

ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ అంశంపై స్పందిస్తూ అన్వేష్ విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. సంపన్నుల వికృత కోరికల వల్లే మైనర్ బాలికలపై ఇలాంటి లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా తాను గతంలో పనిచేసిన హైదరాబాద్, గోవా వంటి నగరాల్లోని స్టార్ హోటల్స్‌లో సెలబ్రిటీలు, సినీ ప్రముఖుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు సాగుతుంటాయని ఆయన పేర్కొన్నారు. థాయిలాండ్ వంటి దేశాల్లోనే కాకుండా, మన కళ్ల ముందే ఇక్కడ కూడా పలువురు ప్రముఖులు ఈ తరహా దారుణాలకు పాల్పడటం తాను స్వయంగా చూశానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా అన్వేష్ వ్యాఖ్యలు:

Advertisement

అన్వేష్ చేసే వ్యాఖ్యలు సమాజంలోని లోపాలను ఎత్తిచూపుతున్నప్పటికీ, సెలబ్రిటీలు మరియు స్టార్ హోటల్స్ వంటి వ్యవస్థలపై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేసేటప్పుడు తగిన ఆధారాలు ఉండటం అత్యంత ముఖ్యం. కేవలం ‘నేను చూశాను’ అని చెప్పడం వల్ల ఇండస్ట్రీలోని అందరినీ తప్పుబట్టినట్లు అవుతుందని, ఇది పలువురి ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గరికపాటి నుండి శివాజీ వరకు ప్రతి విషయంలోనూ దూకుడుగా స్పందించే క్రమంలో, వ్యక్తిగత విమర్శలకు తావులేకుండా కేవలం సమస్యల మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఇక లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న యూట్యూబర్‌గా అన్వేష్ చేసే ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపుతుంది కాబట్టి, సంచలనం కోసం కాకుండా పరిష్కారం దిశగా, ఎంతో ఆలోచించి మాట్లాడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

Advertisement

ALSO READ:Dhurandhar: మొత్తం 7 దేశాల్లో సత్తా చాటుతున్న ధురంధర్.. ఆ రికార్డ్స్ అన్నీ మాయం!

ఈ వ్యాఖ్యలు నిజం ఐతే:

సమాజంలో పరువు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులు ఇలాంటి అమానవీయ ఘటనలకు పాల్పడటం సిగ్గుచేటు. అన్వేష్ వంటి వారు ఇలాంటి విషయాలను బహిరంగంగా ప్రస్తావించడం వల్ల సామాన్యుల్లో కొంత మేరకైనా అవగాహన పెరుగుతుంది. కేవలం వినోదం కోసమే కాకుండా, సమాజంలోని కుళ్లును కడిగిపారేయడానికి గొంతు ఎత్తడం కరెక్ట్ అయినా, ఇక అతను చెబుతున్నది నిజామా కాదా అని తేల్చాలి అని నెటిజన్స్ అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి దారుణాలపై అధికారులు దృష్టి సారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే చిన్నారులకు రక్షణ ఉంటుంది. మరి చూద్దాం ఏది నిజమో ఏది అబద్దమో.. అలాగే అన్వేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×