BigTV English

Anchor Shiva Jyothi : అక్రమంగా రూ.10 కోట్లు… చిట్టా మొత్తం బయటపెట్టిన నా అన్వేషణ..!

Anchor Shiva Jyothi : అక్రమంగా రూ.10 కోట్లు… చిట్టా మొత్తం బయటపెట్టిన నా అన్వేషణ..!

Anchor Shiva Jyothi :గత రెండు మూడు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎంత సంచలనం సృష్టిస్థోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీలను మొదలుకొని యూట్యూబర్ల వరకు చాలామంది ఈ బెట్టింగ్ ఆప్స్ ను ప్రమోట్ చేసి భారీగా సంపాదించారు. ఎవరైతే వీరిని ఫాలో అవుతున్నారో వారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి, మోసపోయి,, ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోయిన వారు ఉన్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరికి నోటీసులు పంపించి మరీ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు యూట్యూబర్ అన్వేష్ కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారి గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టి అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ క్రమంలోనే శివజ్యోతి (Shiva Jyothi) పై నా అన్వేషణ అన్వేష్ (Naa Anveshana Anvesh) చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.


Mullapudi Brahmanandam: ఇండస్ట్రీలో విషాదం.. అల్లరి నరేష్ నిర్మాత మృతి..!

తెలంగాణ పోలీసుల కంటే వేగంగా అన్వేష్..


తెలంగాణ పోలీసుల కంటే ముందే ఒక యుద్ధమే ప్రకటించారు అన్వేష్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. ఆ మధ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ (Bhaiya Sunny Yadav) పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఈయన.. సినీ కమెడియన్ అలీ (Ali) ను కూడా వదల్లేదు. వందల సినిమాలు చేసిన వ్యక్తి డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలాంటి యాప్ లను ప్రమోట్ చేయడం ఏంటి? అంటూ మండిపడ్డాడు. ఇప్పుడు టీవీ యాంకర్, తీన్మార్ వార్తలతో ప్రాచుర్యం పొందిన సావిత్రి అలియాస్ శివ జ్యోతి పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

బిగ్ బాస్ తో భారీ క్రేజ్.. ఆపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్..

నీకు అసలు విషయంలోకి వెళితే.. తీన్మార్ వార్తలతో పాపులారిటీ దక్కించుకున్న శివజ్యోతి.. ఆ తర్వాత ఇంకో ప్రముఖ ఛానల్ లోకి వెళ్లిపోయి.. అక్కడ కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో పాపులారిటీ అయిన తర్వాత బిగ్ బాస్ టీవీ షోలో కూడా పాల్గొనింది. రీచ్ పెరగడంతో సోషల్ మీడియాలో కూడా విపరీతమైన హైపోచ్చింది. ఇక భర్త గంగోలితో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వీడియోలను, వ్లాగ్ రూపంలో యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం మొదలుపెట్టి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు అనుకూలంగా కూడా ప్రచారం చేసింది. అయితే ఆ మధ్య బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసింది. ఇప్పుడు దానిని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు అన్వేష్.

శివజ్యోతి గుట్టు రట్టు చేసిన నా అన్వేషణ అన్వేష్.

శివ జ్యోతి భారీగా సంపాదించారు. దాదాపు రూ.10 కోట్ల స్కామ్ చేసింది. హైదరాబాదులో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో హైవే పక్కన ఆమె భూమి కూడా కొనుగోలు చేశారు అంటూ తన వీడియోలో తెలిపారు. ముఖ్యంగా ఆమె కుటుంబ నేపథ్యం గురించి చెప్పుకొస్తూ విమర్శలు గుప్పించారు. బర్రెలక్క.. గొర్రెలక్క.. జ్యోతక్క అంటూ ఆమెపై కాస్త విరుచుకుపడుతూ కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతక్క పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి హాస్పిటల్లో టాబ్లెట్స్ తీసుకువచ్చి ఊర్లో అమ్ముతాడు. ఈమె ఇంట్లో బీడీలు చుట్టేది .ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఈమెను ఒకరు చూసి నువ్వు యాంకర్ గా పనికొస్తావని చెప్పగానే వెంటనే ఎర్ర బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. రేవంత్ రెడ్డి సార్ మీరు ఎక్కడ ఉన్నారు? ఒకసారి ఈమెను చూడండి. చాలామంది చావుకు కారణమై ఆ డబ్బుతో ఎన్నో కొనుగోలు చేసింది. ఆమెను వెంటనే జైల్లోకి వేసి.. సంపాదించిన ఈ డబ్బు మొత్తాన్ని లాక్కొని పేద ప్రజలకు ఇవ్వండి. అంటూ కామెంట్ చేస్తూనే జ్యోతక్క నీకు సిగ్గు లేదా? ఇలాంటి పనులు చేయడానికి.. ? పేదరికం నుంచి వచ్చావు కదా పేదవారిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×