Puri: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా కొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. ఉగాది పండగ రోజున పూరి కనెక్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. అనౌన్స్మెంట్ ఫోటోలో పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి, చార్మి కౌర్ ఉన్నారు. ఈ అప్‌డేట్‌పై పూరి అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
ఓ ఫోటో… రెండు డిజాస్టర్స్!
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి విడుదలైన ఫోటో ఫ్యాన్స్‌ను టెన్షన్‌లో పడేసింది. కారణం, ఇదే విధంగా గతంలో విడుదలైన రెండు అనౌన్స్మెంట్ ఫోటోలు కూడా ప్రేక్షకులకు నిరాశే మిగిల్చాయి.
ఈ రెండు సినిమాల అనౌన్స్మెంట్ ఫోటోలని కంపేర్ చేసి చూస్తే… కుడివైపు పూరి, ఎడమవైపు చార్మీ, మధ్యలో హీరో ఉన్న విధానం సమానంగా ఉంది. ఇప్పుడు విజయ్ సేతుపతితోనూ ఇదే స్టైల్‌లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ భయపడుతున్నారు.
పూరి మళ్లీ పుంజుకుంటాడా?
పూరి జగన్నాథ్ గట్టి రైటర్, మేకింగ్ స్పెషలిస్టు. కానీ, గత కొన్నేళ్లుగా ఆయన కథలు, ప్రెజెంటేషన్‌లో కొత్తదనం లేకపోవడం, రొటీన్ మాస్ మసాలా ఫార్ములాతోనే వెళ్లడం వల్ల వరుస ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి. లైగర్ సినిమా కేవలం పూరి కెరీర్‌కే కాకుండా విజయ్ దేవరకొండ మార్కెట్‌కూ పెద్ద దెబ్బకొట్టింది.
డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అయినా ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనుకుంటే పూరి పని అయిపొయింది అనే కామెంట్స్ ని వినిపించేలా చేసింది. సీక్వెల్ హైప్ తో రిలీజైన ఈ మూవీ చేయకపోయినా పూరిపై ఆడియన్స్ లో కొంతమేర నమ్మకం ఉండేదేమో, డబుల్ ఇస్మార్ట్ అంతటి ఇంపాక్ట్ చూపించింది.
ఇప్పుడు విజయ్ సేతుపతితో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పూరికి లైఫ్ టర్నింగ్ అవుతుందా? లేక మరో ఫ్లాప్‌గా మిగిలిపోతుందా? అన్నది చూడాలి. ఇదే పాత ఫార్ములా అయితే రిజల్ట్ కూడా అదే అనేది ఫ్యాన్స్ భయం. కానీ, పూరి జగన్నాథ్ తన క్లాసిక్ మాస్ ఎలిమెంట్స్, కొత్త కథనంతో వస్తే తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చే అవకాశముంది.
సినిమాపై అంచనాలు!
విజయ్ సేతుపతి పాత్రలో కొత్తదనం ఉందా? పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఎలాంటి స్థాయిలో ఉంటాయి? కథలో సరికొత్త ట్విస్ట్‌లతో వస్తాడా లేక పాత పద్ధతులకే పరిమితమవుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం అందే వరకు ఫ్యాన్స్ హైలెవెల్ టెన్షన్‌లోనే ఉంటారు. కానీ ఒకే స్టైల్ ఫోటో చూసి భయపడకుండా, సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. ‘అన్ని ఒకేలా ఉన్నా, రిజల్ట్ మారితే చాలు’ – ఇదే ఇప్పుడు పూరి ఫ్యాన్స్ ఆశ.