BigTV English
Advertisement

Nikhil’s Swayambhu Update: నిఖిల్ ‘స్వయంభు’లోకి ఇస్మార్ట్ బ్యూటీ.. యువరాణిగా ఫస్ట్ లుక్..!

Nikhil’s Swayambhu Update: నిఖిల్ ‘స్వయంభు’లోకి ఇస్మార్ట్ బ్యూటీ.. యువరాణిగా ఫస్ట్ లుక్..!
Nikhil Swayambhu Movie Shooting
Swayambhu Movie Shooting

Nabha Natesh joins Nikhil’s Swayambhu Movie Shooting: కార్తికేయ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో నిఖిల్ ఆ తర్వాత ఆ మూవీకి కొనసాగింపుగా ‘కార్తికేయ 2’ మూవీతో వచ్చి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీతో పాన్ ఇండియా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.


ఆ తర్వాత మరో సినిమా 18 పేజెస్‌తో మరొక హిట్‌ను అందుకున్నాడు. దీంతో నిఖిల్‌కు మరింత క్రేజ్ పెరిగింది. అదే జోష్‌లో వరుసపెట్టి సినిమాలతో ప్రేక్షకాభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. అయితే అప్పటి వరకు ఎలాంటి ఫ్లాప్‌లు లేకుండా కొత్త కొత్త జానర్‌లలో సినిమాలు చేసుకుంటూ పోతున్న నిఖిల్‌కు సడెన్‌గా ఒక డిజాస్టర్ తగిలింది.

గతేడాది ‘స్పై’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘోర ఫ్లాప్‌ను అందుకుంది. దీంతో తన నెక్స్ట్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టాడు నిఖిల్. ఇందులో భాగంగా ఇప్పుడు తన కెరీర్‌లో మరొక డిఫరెంట్ రోల్ ఉన్న సినిమాను చేస్తున్నాడు. ‘స్వయంభు’గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నిఖిల్ ఒక యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు.


Also Read: ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయ్.. సినిమా ఎలా ఉందంటే..?

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై భార్ హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ మరో అప్డేట్‌ను అందించారు. ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయింది.

ఇప్పుడు మరొక హీరోయిన్‌గా మేకర్స్ నభా నటేష్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో నభా నటేష్ ఎంతో అందంగా కనిపిస్తుంది. పోస్టర్‌లో తన అందాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ వైరల్‌ అవుతోంది.

Also Read: Vijay Devarakonda: ఐరన్ వంచలేదు మావా.. గట్టిగా దించాడు..?

అయితే ఈ పోస్టర్‌తో పాటు ఇందులో ఆమె నటుస్తున్న పాత్రకి మేకోవర్‌తో ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో నభా తన మేకోవర్‌తో సెట్స్‌లో నిఖిల్‌ని కలిసినట్టుగా చూపించారు. దీంతో ఆమె రాకతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అంతేకాకండా భారత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా.. ఠాగూర్ మధు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇకపోతే నిఖిల్ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడు. వారియర్ పాత్రలో కనిపిస్తుండటంతో దానికి సంబంధించిన విలు, కత్తి విద్యలు నేర్చుకుంటున్నాడు. ఎంతగానో చెమటోడుస్తున్నాడు. నిఖిల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడుతున్నాడో ఇదివరకే రిలీజ్ చేసిన కొన్ని వీడియోలు చూస్తే అర్థం అవుతుంది.

Tags

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×