BigTV English

‘Family Star’ Movie First Review: ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ రివ్యూస్ వచ్చేసిందోచ్.. సినిమా ఎలా ఉందంటే..?

‘Family Star’ Movie First Review: ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ రివ్యూస్ వచ్చేసిందోచ్.. సినిమా ఎలా ఉందంటే..?
Family Star First Review
Family Star First Review

Vijay Devarakonda’s Family Star First Review: పెళ్లి చూపులు మూవీతో స్టార్ట్ అయిన విజయ్ దేవర కొండ హిట్ జర్నీ ఆ తర్వాత పలు సినిమాలతో దూసుకుపోయింది. అయితే తన కెరీర్‌లో అప్పటి వరకు క్లాస్ సినిమాలు చేస్తూ అదరగొట్టేసిన విజయ్ ఒక్కసారిగా మాస్ సినిమాపై పడ్డాడు. ఇందులో భాగంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ మూవీ చేశాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీపై అప్పట్లో ఫుల్ హైప్ ఉండేది. అదే స్థాయి అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం అందుకుంది. ఎంతో ఎక్స్‌పెర్టేషన్స్‌తో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు నిరాశతో బయటకొచ్చారు.


అయితే ఈ సారి మళ్లీ అలాంటి తప్పు చేయకూడదని విజయ్ నిర్ణయించుకున్నాడు. దీంతో మళ్లీ క్లాస్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే గతేడాది ఖుషి మూవీతో వచ్చి మంచి పాజిటివ్ టాక్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకాభిమానులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. తనకు గీతా గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు పరశురామ్‌తో ఇప్పుడొక మూవీ చేశాడు.

ఈ మూవీ రేపు అనగా.. ఏప్రిల్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీమియర్స్ ఈ రోజు అమెరికాలో ప్రదర్శించారు. కాగా హైదరాబాద్‌లో కూడా ఈ మూవీని మీడియా, ఫ్యామిలీలకు చూపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనికంటే ముందు ఒక షో వేశారు. ఈ షోని విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ వీక్షించాయి. ఇప్పుడు వారు ఈ మూవీపై వారి రివ్యూలు ఇస్తున్నారు.


Also Read: దేవర ఫస్ట్ సింగిల్ రాబోతుందా.. ఈ ట్వీట్‌కు అర్థమేంటి..?

ఈ మేరకు ఫ్యామిలీ స్టార్ సినిమా చూసిన తర్వాత తన భార్య తేజశ్విని తన అభిప్రాయాన్ని తెలిపినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఇందులో భాగంగా హిట్టు కొట్టేశారండీ అని ఆమె కాంప్లిమెంట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని.. ఆమె జడ్జ్‌మెంట్ పర్ఫెక్ట్ ఉంటుందని దిల్ రాజు తెలిపారు.

అంతేకాకుండా తన కూతురు హన్షిత రెడ్డి కూడా సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. ‘విజయ్ దేవరకొండ కిల్డ్ ఇట్’ (హీరో కుమ్మేశాడు) అంటూ తనను హగ్ చేసుకుందని దిల్ రాజు చెప్పాడు. ఈ మేరకు తన కూతురు దర్శకుడికి ఫోన్ చేసి మాట్లాడిందని పేర్కొన్నాడు. అలాగే విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కూడా వారి అభిప్రాయాలు తెలిపారు.

Also Read: సమంతతో లిప్ లాక్.. సినిమా తీసినంత కాలం తననే ఎంచుకుంటా!: డైరెక్టర్ సుకుమార్

పెళ్లి చూపులు మూవీ ముందు వరకు తన జీవితం చాలా సింపుల్‌‌గా ఉండేదని అన్నాడు విజయ్. అప్పట్లో కనీసం బండిలో వంద రూపాయల పెట్రోల్ కొడితే చాలు మనల్ని ఎవరూ ఆపలేరని ఫీలయ్యేవాడినని తెలిపాడు. ఒకరకంగా ఈ మూవీని చూసిన మిడిల్ ఫ్యామిలీ పర్సన్స్ తమ బయోపిక్ అనుకుంటారని మూవీ యూనిట్ పేర్కొంది.

అంతేకాకుండా విజయ్ దేవరకొండ తండ్రి గోవర్థన్ కూడా ఈ మూవీ చూశారు. ఈ మేరకు ‘దిల్’ రాజు బయోపిక్‌లా ఈ మూవీ ఉందని చెప్పినట్లు దిల్ రాజు తెలిపారు. అంతేకాకుండా ఆనంద్ దేవరకొండ కూడా ఈ మూవీ చూసి చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు. దీని బట్టి చూస్తే బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×