Finn Allen : ప్రస్తుతం మేజర్ క్రికెట్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే MCL ప్రారంభ మ్యాచ్ లో ఓక్లాండ్ కొలిజియంలో వాషింగ్టన్ ఫ్రీడమ్ తో జరిగిన మ్యాచ్ లో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ కి ప్రాతినిధ్యం వహించిన ఫిన్ అలెన్ టీ-20 క్రికెట్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 51 బంతుల్లో 151 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇంతటి అద్భుతమైన ఇన్నింగ్స్ చూసిన అభిమానులకు పండుగలా అనిపించింది. అలెన్్ దూకుడు ఇన్నింగ్స్ లో ముఖ్యంగా 19 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టి శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ ను 20 ఓవర్లలో 269/5 భారీ స్కోర్ కి నడిపించడంలో సహాయపడింది.
Also Read : WTC- Handling The Ball: WTC ఫైనల్‌లో అనూహ్య ఘటన..ఏంటి ఈ ‘హ్యాండిల్డ్ ది బాల్’ వివాదం ?
ముఖ్యంగా అలెన్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీని.. అలాగే 34 బంతుల్లో సెంచరీ సాధించి.. MCL చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. కేవలం 49 బంతుల్లోనే 150 పరుగులు సాధించి టీ-20 క్రికెట్ లో వేగవంతమైన 150కి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టీ-20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు అలెన్ ఒకే ఒక్క ఇన్నింగ్స్ లోనే 19 సిక్సర్లను బాదడం విశేషం. ఇక ఇది ఇప్పుడు టీ-20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు, 2017లో క్రిస్ గేల్ గతంలో నెలకొల్పిన 18 సిక్సుల రికార్డును అధిగమించాడు అలెన్. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టు 269/5 MLC చరిత్రలోనే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఇక USA లో టీ-20 మ్యాచ్ లో ఒక జట్టు 250 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే మొదటి సారి కావడం విశేష:.
ముఖ్యంగా అలెన్ రికార్డు బ్రేకింగ్స్ ఇన్నింగ్స్ ఆడటంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ యూనికార్న్స్ జట్టును వాషింగ్టన్ ఫ్రీడమ్ పై 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. క్రిస్ గేల్, డెవాల్డ్ బ్రెవీస్ వంటి దిగ్గజాలను అధిగమించి.. టీ-20 ఇన్నింగ్స్ లో అత్యంత వేగవంతంగా 150 పరుగులు చేశాడు. అలెన్ 34 బంతుల్లోనే సెంచరీ చేయడం గొప్ప విషయం. MLC చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అలెన్ ఇన్నింగ్స్ అద్భుతమనే చెప్పవచ్చు. టీవీల్లో అయినా స్టేడియంలో నైనా అతని ఇన్నింగ్స్ చూడటానికి ప్రేక్షకులకు రెండు కళ్లు చాలలేదనే చెప్పవచ్చు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ సీఫెర్ట్ 18 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ అలెన్ 151 పరుగులు చేసి మిచెల్ ఓవెన్ బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో ఆటగాడు సంజయ్ కృష్ణమూర్తి 36 పరుగులు, హసన్ ఖాన్ 38, కూపర్ 5, అండర్ సన్ 3 పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. మరోవైపు 270 పరుగుల భారీ లక్ష్యానికి బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 123 పరుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్టు ఘన విజయం సాధించింది. మరోవైపు ఐపీఎల్ 2025 వేలంలో రూ.2కోట్ల ధరకు ఉన్నప్పటికీ ఎవ్వరూ కూడా బిడ్ వేయలేదు. నవంబర్ 2024లో జరిగిన వేలంలో అలెన్ మాత్రం ఆసక్తిలేని ఆటగాడిగా పరిగణించబడటం గమనార్హం.