Naga Chaitanya – Akhil Akkineni: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య (Naga Chaitanya) కో స్టార్ సమంత (Samantha ) తో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి దాదాపు ఏడేళ్లపాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట, పెద్దలను ఒప్పించి, 2017లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు సంతోషంగా ఉన్న వీరు అనూహ్యంగా 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక వీరిద్దరిని కలపడానికి ఇండస్ట్రీ పెద్దలు కూడా ప్రయత్నం చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ కుదరలేదు. ఇదిలా ఉండగా సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Shobhita dhulipala)తో డేటింగ్ లో ఉన్నట్లు గతంలో వార్తలు జోరుగా వినిపించాయి. కానీ దీనిపై ఈ జంట స్పందించలేదు.
పెళ్లికి సిద్ధమైన నాగచైతన్య..
లండన్ లో వీరిద్దరూ ఒకే హోటల్లో ఉన్న ఫోటోలు బయటకు వచ్చినా స్పందించకపోవడంతో రూమర్స్ బాగా వ్యాపించాయి. ఇక రూమర్స్ ను నిజం చేస్తూ 2024 ఆగస్టు 8న నాగచైతన్య – శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను నాగార్జున (Nagarjuna)సోషల్ మీడియాలో షేర్ చేసి, నిశ్చితార్దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వీరి వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించినట్లు నాగచైతన్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే.
అఖిల్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున..
ఇక అందరూ నాగచైతన్య – శోభిత పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉండగా.. సడన్ గా అక్కినేని అఖిల్ (Akkineni Akhil) , జైనాబ్ రవ్డ్జీ (Jainab Ravdjee)ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని, సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే అఖిల్ – జైనాబ్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను కూడా నాగార్జున షేర్ చేస్తూ.. వీరి నిశ్చితార్ధాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇద్దరి పెళ్లిళ్లు ఓకే వేదికపై చేస్తారని అందరూ అనుకోగా, నాగార్జున మాత్రం సడన్ ట్విస్ట్ ఇచ్చారు. ” డిసెంబర్ 4వ తేదీన అక్కినేని నాగచైతన్య తో పాటు అఖిల్ వివాహం కూడా జరగబోతుందనే వార్తలలో నిజం లేదు. అఖిల్ – జైనాబ్ వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు. అఖిల్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అఖిల్ కాబోయే భార్య జైనాబ్ మంచి అమ్మాయి. వారిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడం చాలా సంతోషం ఉంది” అంటూ నాగార్జున స్పష్టం చేశారు. మొత్తానికైతే కొడుకులిద్దరి పెళ్లిళ్లను ఒకేసారి కాకుండా విడివిడిగా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అఖిల్ , జైనాబ్ నిశ్చితార్థం ఈనెల 26వ తేదీన రహస్యంగా, సింపుల్ గా జరిగిన విషయం తెలిసిందే.
సక్సెస్ కోసం ఆరాటం..
అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అక్కినేని నాగార్జున నిలబెట్టారు. కానీ నాగార్జున వారసత్వాన్ని నిలబెట్టడంలో అఖిల్ , నాగచైతన్య ఇద్దరూ చతికిల పడ్డారని చెప్పవచ్చు. ఒక్క కమర్షియల్ హిట్ కోసం భారీగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇద్దరి ఖాతాలో ఒక హిట్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆయన కెరియర్ లో మైలురాయిగా మారుతుందని చిత్ర బృందం తెలిపింది. మరి ఏ మేరకు అక్కినేని నాగచైతన్య ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.