OG Release Date : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ (They Call Him OG). ముంబై బ్యాగ్రౌండ్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లిమ్స్ మెగా ఫాన్స్ కు పూనకాలు తెప్పించింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకోగా, పవన్ మరోసారి డేట్స్ కేటాయిస్తే చాలు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా రిలీజ్ డేట్ పై ఓ వార్త బయటకు వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజి (They Call Him OG), ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూడు సినిమాల్లోనూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ మాత్రం ‘ఓజి’నే. ఈ మూవీ రిలీజ్ విషయంలో ఇప్పటిదాకా చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. నిజానికి ఈ ఏడాది సెప్టెంబర్ 27న ‘ఓజి’ మూవీ థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయంగా బిజీ అవ్వడంతో, ‘ఓజి’ షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ‘ఓజి’ ప్లేస్ లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ తెరపైకి వచ్చింది. మరి ‘ఓజి’ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఏంటి ? అంటే 2025 సమ్మర్ కానుకగా మార్చి 27న ‘ఓజి’ మూవీ రిలీజ్ కాబోతోంది అనే టాక్ నడిచింది.
అయితే ఇండస్ట్రీలో ఇన్సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం ఇదే రిలీజ్ డేట్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మొత్తానికి వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లు బ్లాస్ట్ కావడం ఖాయం అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
‘హరిహర వీరమల్లు పార్ట్ వన్ – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Hari Hara Veeramallu) సినిమా షూటింగ్ చిత్రకరణ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఈ వీకెండ్ లో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబి డియోల్ కీలకపాత్రను పోషిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాను రూపొందిస్తుండగా. ఈ మూవీ 2025 మార్చి 28న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోందని ప్రకటించారు. కానీ ఇప్పుడు ‘ఓజీ’ రిలీజ్ డేట్ మార్చ్ 27 అని విన్పిస్తుండడంతో, ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ డేట్ ను మారుస్తారా? ఈ రెండు సినిమాలలో ముందుగా రిలీజ్ అయ్యే మూవీ ఏంటి? అనే విషయం ఆశక్తికరంగా మారింది.