E-Paper
Advertisement

Pradeep Machiraju : టైటిల్ పవన్ కళ్యాణ్ ది, లాంచింగ్ మహేష్ బాబు తో

Pradeep Machiraju : టైటిల్ పవన్ కళ్యాణ్ ది, లాంచింగ్ మహేష్ బాబు తో
Advertisement

Akkada Ammayi Ikkada Abbayi : ప్రదీప్ మాచిరాజు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడుగా ఎన్నో సినిమాల్లో కనిపించిన ప్రదీప్ యాంకర్ గా మంచి గుర్తింపును సాధించుకున్నాడు. అయితే యాంకర్ ప్రదీప్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాంకర్ ప్రదీప్ కెరియర్ సాఫీగా సాగుతున్న టైంలో తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు దొరకడం అనేది తనను పర్సనల్ గా చాలా డ్యామేజ్ చేసింది. అవకాశాలు కూడా కొంత మేరకు అప్పట్లో తగ్గాయి. లేకపోతే ప్రదీప్ కేవలం యాంకర్ గానే కాకుండా హీరోగా కూడా తన లెక్కను పరీక్షించుకుంటున్నాడు. ఇదివరకే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఒక సినిమాలో హీరోగా నటించాడు ప్రదీప్. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాలో పాటలు మాత్రం మంచి పేరు సాధించాయి. ఈ పాటలు సినిమా మీద మంచి అంచనాలను పెంచాయి. అయితే అంచనాలను సినిమా ఊహించిన స్థాయిలో అందుకోలేకపోయింది.

ఇక ప్రస్తుతం నితిన్ – భరత్ దర్శకత్వంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రదీప్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని టైటిల్ వినగానే అందరికీ మొదటిగా గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదే టైటిల్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలతో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో ఉన్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాల్లోనూ మరోవైపు రాజకీయాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ మంచి బిజీగా ఉన్నారు. ఇక పవన్ నటిస్తున్న మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Advertisement

Also Read : Buchi Babu – Rajamouli : రమా రాజమౌళి టెక్నిక్ ఫాలో అవుతున్న బుచ్చిబాబు

అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలామందికి స్టార్ హీరోస్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెబుతారు. వీళ్ళ సినిమాలు రీ రిలీజ్ అయిన కూడా ఆడియన్స్ విపరీతంగా బ్రహ్మరథం పడుతుంటారు. అయితే ఇప్పుడు ఇద్దరి ఫ్యాన్ బేస్ ఆకర్షిస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలోని లేలే అనే పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు లాంచ్ చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమో ఇదివరకే రిలీజ్ అయింది. ప్రోమో కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి రథన్ సంగీతం అందిస్తున్నారు. రథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రథన్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా మంచి మ్యూజిక్ ఇస్తాడని ఒక ఒపీనియన్ కూడా ఉంది. ఇక ఫుల్ సాంగ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో రేపు తెలియనుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×