BigTV English

Beauty Tips: వీటిని తరచూ తిన్నారంటే మీరు త్వరగా ముసలివారై పోతారు, జాగ్రత్త

Beauty Tips: వీటిని తరచూ తిన్నారంటే మీరు త్వరగా ముసలివారై పోతారు, జాగ్రత్త

మీరు ఏం తింటారు? అనేదే మీ ఆరోగ్యాన్ని శాసిస్తుంది. మీ పొట్టలో పడే ప్రతి ఆహారం శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుంది. వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. వయసును బట్టి అది వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల మీరు ముందుగానే వృద్ధాప్యం బారిన పడే అవకాశం ఉంది. ఎలాంటి ఆహారాలు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయో తెలుసుకోండి. చర్మం ముడుచుకుపోవడం, గీతలు పడడం వంటివన్నీ కూడా వృద్ధాప్యం దగ్గర పడుతుందని చెప్పే సూచనలే. కొన్ని రకాల ఆహారాలు వృద్ధాప్యాన్ని త్వరగానే తెచ్చిపెడతాయి. వీటిని మీరు తినకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.


చక్కెర
పంచదారతో చేసే ఏ స్వీట్ అయినా ఇష్టంగా తినేవారు ఎంతోమంది. అయితే స్వీట్‌ను మీరు ఎంత ఎక్కువగా తింటే మీరు అంత త్వరగా పడతారు. చర్మం యవ్వనంగా ఉండాలంటే కొల్లాజిన్  చాలా ముఖ్యం. కొలాజెన్ ఉత్పత్తిని దెబ్బతీయటంలో చక్కెర నుండి ఆహారాలు ముందుంటాయి. ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్, సోడాలు, పేస్ట్రీలు, కేకులు ఇవన్నీ కూడా మీ వయస్సును పెరిగేలా చేస్తాయి. ఇది హైడ్రేషన్ బారినపడి చర్మం అంద వికారంగా ఉండేలా చేస్తాయి.

ప్రాసెస్డ్ మాంసం
తాజాగా చికెన్ దుకాణం నుండి తెచ్చిన మాంసాన్ని మాత్రమే వండుకొని తినాలి. అలాకాకుండా నిల్వచేసిన అది కూడా ప్రాసెస్ చేసిన చికెన్, మటన్ వంటివి తినడం వల్ల వృద్ధాప్యం వేగవంతం అవుతుంది. కొన్ని రకాల బర్గర్, పిజ్జా వంటి వాటిలో ప్రాసెస్డ్ చికెన్ వాడుతూ ఉంటారు. ఇలా ప్రాసెస్ చేసిన మాంసాలను తరచుగా తింటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. దీనివల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోయి ముడతలు పడుతుంది. అలాగే వీటి వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం వంటి రోగాలు కూడా వస్తాయి.


వైట్ బ్రెడ్
బ్రెడ్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో వైట్ బ్రెడ్ ఒకటి. మిల్లెట్లు, ఓట్స్ తో తయారు చేసిన బ్రెడ్లు ఆరోగ్యానికి మంచిది. బ్రౌన్ బ్రెడ్ కూడా ఆరోగ్యానికి మంచిదే. హోల్ వీట్ బ్రెడ్ అంటే పూర్తిగా గోధుమపిండితో చేసిన బ్రెడ్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కానీ వైట్ బ్రెడ్ ను మైదాపిండితో తయారు చేస్తారు. అలాంటి వైట్ బ్రెడ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను పెంచుతుంది. దీనివల్ల మీరు అకాల అభివృద్ధి అవకాశం ఉంటుంది.

ఫ్రెంచ్ ఫ్రైస్
ఫ్రెంచ్ ఫ్రైస్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. యువత పిల్లలు ఎక్కువగా పెట్టిన ఇష్టపడతారు. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తినకపోవడమే మంచిది. ఇది చర్మాన్ని లోపల నుంచి వృద్ధాప్యం బారిన పడేలా చేస్తుంది. ఇది చర్మానికి ఏ మాత్రం మంచిది కాదు.

కాఫీ
కాఫీ గింజల్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. కెఫిన్ వల్ల చర్మం వృద్ధాప్యం బారిన పడుతుంది. కెఫిన్ చాలా తక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే, కానీ రోజుకి రెండు మూడు సార్లు కాఫీలు తాగడం మొదలుపెడితే చర్మం డీహైడ్రేషన్ బారిన పడి సహజ కాంతిని కోల్పోతుంది. కొల్లాజిన్ ఉత్పత్తి కూడా ప్రభావితం అవుతుంది. ఇది నిద్రకు ఏ మాత్రం మంచిది కాదు.

కూల్ డ్రింక్స్
శీతల పానీయాలు, ఎరేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఏవైనా కూడా చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పానీయాలు చక్కెర కృత్రిమ రసాయనాలతో నిండి ఉంటాయి. ఇవి కొల్లాజెన్ స్థాయిలను తగ్గిస్తాయి. అకాలంగా చర్మంపై ముడతలు పడేలా చేస్తాయి.

కాల్చిన మాంసం
ఎంతోమంది మాంసాన్ని కాల్చి వండుతూ ఉంటారు. ఇలా మాంసాన్ని కాల్చడం వల్ల హానికరమైన సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తాయి. ఇది చర్మం త్వరగా ముడతలు పడేలా చేస్తాయి.

రెడీ టు కుక్ ఫుడ్
బయట రెడీ టు కుక్ ఫుడ్ చాలా దొరుకుతున్నాయి. అలాగే నూడుల్స్ వంటి ఇన్‌స్టెంట్ ఆహారాలు కూడా ఉన్నాయి. ఇలాంటివి తినడం వల్ల ఆక్సీకరణ నష్టం జరుగుతుంది. ఇది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. వీటిలో పోషకాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం తగ్గించాలి. లేకుంటే అకాల వృద్ధాప్యం బారిన పడే అవకాశం ఉంది.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×