BigTV English

Naga Vamshi: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడంలో నువ్వు సూపర్ బాసూ…

Naga Vamshi: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడంలో నువ్వు సూపర్ బాసూ…

Naga Vamshi: టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాకుండా, ఆయనను స్పెషల్ గా ట్రీట్ చేసే వ్యక్తులను కూడా ఫ్యాన్స్ ఆదరిస్తారు. ఆ లిస్టులో ప్రొడ్యూసర్ నాగ వంశీ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. తారక్ అన్న అంటూ ప్రతి సందర్భంలో ఎన్టీఆర్ పై ప్రేమ చూపించే నాగ వంశీ, స్టార్ హీరోతో కేవలం ప్రొడ్యూసర్-హీరో రిలేషన్ కాకుండా పర్సనల్ బాండింగ్ కూడా మైంటైన్ చేస్తున్నాడు.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత కాస్త కష్టాల్లో పడింది. అయితే ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాతో ఆ బ్యానర్ తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ విషయాన్ని నాగ వంశీ చాలా సందర్భాల్లో చెప్పాడు. తారక్ అందించిన హిట్ వల్లే తమ బ్యానర్ తిరిగి ట్రాక్ లోకి వచ్చిందని ఆయన ఓపెన్ గా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇప్పుడు దేవర సినిమా విషయంలోనూ నాగ వంశీ ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాడు. సినిమాకి రికార్డ్ బ్రేకింగ్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేసి, మార్కెటింగ్, ప్రొమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ తారక్ అన్న అంటూ ఎన్టీఆర్ పట్ల తన అభిమానాన్ని చూపిస్తూ, ప్రతి అవకాశం వచ్చినప్పుడు సపోర్ట్ అందిస్తున్నాడు.


ఇప్పుడు నాగ వంశీ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టాడు. జైలర్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ ని సెట్ చేయాలని గత కొంత కాలంగా ట్రై చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇనిషియల్ టాక్స్ కూడా పూర్తయ్యాయని చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. జైలర్ 2 షూటింగ్ పూర్తయిన తర్వాత నెల్సన్ ఖాళీ అవుతాడు. ప్రస్తుతానికి అతను మరో సినిమా సైన్ చేయలేదు, అంటే కాస్త గ్యాప్ ఉంటుంది.

ఇక ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, వార్ 2 షూటింగ్ ఇప్పటికే తుదిదశలో ఉంది. మరోవైపు ఎన్టీఆర్ 31 కూడా సెట్స్ పైకి వెళ్లింది, రెగ్యులర్ షూటింగ్ లో ఎన్టీఆర్ ఏప్రిల్ నుంచి జాయిన్ అవుతాడు. ఇదంతా జరుగుతుండగా నాగ వంశీ ఎన్టీఆర్-నెల్సన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే, ఇది దేవర 2 కి ముందు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే నాగ వంశీ ఎన్టీఆర్-నెల్సన్ ప్రాజెక్ట్ పై చాలా ఆశక్తిగా ఉన్నాడని చెప్పొచ్చు. ఇప్పుడున్న టైమ్ లైన్ ప్రకారం నెల్సన్ తన జైలర్ 2 సినిమాని కంప్లీట్ చేసే లోపు, ఎన్టీఆర్ కూడా తన పాత ప్రాజెక్ట్స్ ముగించేస్తాడు. దాంతో ఇద్దరికీ కూడా కంఫర్ట్‌గా టైమ్ ఉండే అవకాశం ఉంది. నెల్సన్ స్టైల్ లో డిఫరెంట్ టేకింగ్ తో ఒక యూనిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ రెడీ చేస్తే, ఎన్టీఆర్ కూడా అందులో తన మాస్ అప్పీల్ తో అదరగొట్టే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ ప్రస్తుతం నీల్ సినిమా మీద పూర్తి దృష్టి పెట్టాడు. ఈ సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్ పై అభిమానులలో ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. నాగ వంశీ నెల్సన్ ప్రాజెక్ట్ సెట్ అయితే, అది మరో క్రేజీ కాంబినేషన్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×