BigTV English

Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొని అడిషనల్ ఏఎస్పీ బాబ్జీ మృతి

Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొని అడిషనల్ ఏఎస్పీ బాబ్జీ మృతి
Advertisement

Road Accident: రోడ్డు ప్రమాదాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవర్ స్పీడ్, అజాగ్రత్త వల్ల వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయాలు పాలవుతుండగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.


తాజాగా శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఏఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి చెందారు. హయత్‌నగర్‌ వద్ద వాకింగ్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఏఎస్పీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన లక్ష్మారెడ్డిపాలెంలో చోటు చేసుకుంది.

రాచకొండలో కంట్రోల్ రూమ్‌లో ఏఎస్పీ నందీశ్వర బాబ్జి పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకో మూడు రోజుల్లో డీజీపీ ఆఫీసుల్లో రిపోర్టు చేయాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఉదయం నాలుగు గంటలకు వాకింగ్ కోసం.. విజయవాడ జాతీయ రహదారి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని కేసు నమోదు చేసి, అడిషనల్ ఎస్పీ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డీసీపీ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: మత్తుమందిచ్చి మహిళలతో ఆ పని చేసే దొంగబాబా.. యువతుల లోదుస్తులు దోచుకునే టెకి

ASP బాబ్జి మృతిచెందిన చోట రోడ్ వైడనింగ్ పనులు జరిగాయని.. అప్పటి నుంచే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. స్కూల్ పిల్లలు కాలేజీ స్టూడెంట్స్ రోడ్డు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు రెండువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రోడ్డు క్రాస్ చేయకుండా చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.  లక్ష్మారెడ్డి పాలెం వద్ద వెంటనే ఫుటోవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఫుటోవర్ బ్రిడ్జి ఏర్పాటుతోనే ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మచిలీపట్నం మండలం వర్రె గూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యక్తి గొంతు కోసి అత్యంత దారుణానికి ఒడిగట్టారు.  మచిలీపట్టణంలోని చింతచెట్టు సెంటర్ లో నివాసం ఉండే శ్రీను అలియాస్ టోపీ శ్రీనుని.. కొంతమంది దుండగులు ఇంట్లోకి చొరబడి దాడి చేసి హత్య చేశారు. హత్య జరిగిన స్థలానికి డీఎస్పీ చేరుకొని, హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. శ్రీను హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. శ్రీను హత్య ఘటనలో ఒక హోంగార్డు, అతని మేనల్లుడు హస్తం ఉన్నట్లుగా తమ విచారణ లో తెేలిందని పోలీసులు తెలిపారు.

 

Related News

Army Major: ఆర్మీ విన్యాసాలు.. తెలుగు మేజర్ రోడ్డు ప్రమాదంలో మృతి

Bus Fire Accident: అయ్యో ఎంత ఘోరం! కదులుతున్న బస్సులో చెలరేగిన మంటలు.. 15 మంది సజీవ దహనం

Hyderabad Crime: పిల్లలను చంపి.. బిల్డింగ్ పైనుండి దూకిన తల్లి, హైదరాబాద్‌లో దారుణం

UP Man hits train: బైక్‌పై రైల్వే ట్రాక్ దాటుతూ.. కిందపడ్డాడు, ఇంతలో దూసుకొచ్చిన రైలు, ఇదిగో వీడియో

Jagtial District: మా నాన్నను చంపేశారు.. భూమి లాక్కున్నారు, ప్రజావాణిలో చిన్నారుల ఆవేదన

Hyderabad News: హైదరాబాద్‌లో ఘోరం.. ఆరుగురు జువైనల్స్‌పై లైంగిక దాడి!

Kadapa Crime News: కడపలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి, అసలు సమస్య అదేనా?

Chirala Beach Accident: బీచ్‌లో విషాదం.. స్నానం చేస్తూ ఐదుగురు మాయం

Big Stories

×