BigTV English

Keerthy Suresh: మా కంటే హీరోలు తోపులేం కాదు.. కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు!

Keerthy Suresh: మా కంటే హీరోలు తోపులేం కాదు.. కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు!

Keerthy Suresh..గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు సమాన రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని ఎంతోమంది హీరోయిన్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోతో సమానంగా హీరోయిన్ నటించగలిగినప్పుడు.. ఎందుకు ఒకే రెమ్యూనరేషన్ ఇవ్వరు అంటూ ఎంతోమంది కామెంట్లు కూడా చేశారు. అంతేకాదు ఇదే విషయంపై మీడియా ముందుకు వచ్చి తమ గళం విప్పారు. కానీ ఏ ఒక్క నిర్మాత వీరి మాటలను పట్టించుకోలేదు. అయితే ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కూడా ఇదే విషయాన్ని లేవనెత్తి నిరూపించింది కూడా.. ఇటీవల ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, ‘శుభం’ అనే సినిమా తీసి సక్సెస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు సమాన రెమ్యూనరేషన్ ఇవ్వాలని చెప్పిన ఈమె..తన సినిమా కోసం పనిచేసిన వారికి ఆడ – మగ అని తేడా లేకుండా సమాన రెమ్యూనరేషన్ ఇచ్చింది.


ఆడ – మగ.. సమాన రెమ్యునరేషన్ పై కీర్తి సురేష్ కామెంట్స్..

దీంతో సమంత పై పలువురు హీరోయిన్లు ప్రశంసలు కురిపించారు. ఇదే ధోరణి ఇండస్ట్రీ అంతటా రావాలి అని కోరుకున్నారు కూడా. ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై మరో నటి ఊహించని కామెంట్లు చేసింది. హీరోల కంటే మేమేం తక్కువ కాదు అంటూ తెలిపింది. అంతేకాదు సమాన రెమ్యూనరేషన్ పై తన కోణాన్ని అభిమానుల ముందు ఉంచింది ఈ ముద్దుగుమ్మ. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


ఉప్పుకప్పురంబు ప్రమోషన్స్ లో కీర్తి సురేష్..

చాలా రోజుల తర్వాత కీర్తి సురేష్ (Keerthy Suresh) మరో కామెడీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘ఉప్పు కప్పురంబు’. జూలై 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుహాస్ (Suhas) నటిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో..ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కీర్తి సురేష్.. హీరోలతో సమానంగా హీరోయిన్లకు పారితోషకం పై తన అభిప్రాయాన్ని పంచుకుంది.

ఆ స్టామినా ఉంటే ఆడవారికి కూడా సమాన రెమ్యూనరేషన్ ఇవ్వాలి – కీర్తి సురేష్

ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.. “రెమ్యూనరేషన్ అనేది ఆడవాళ్లు – మగవాళ్లకు సంబంధించింది కాదు. ముఖ్యంగా ఇందులో ఈక్వాలిటీ తీసుకురావడం అనేది అర్థం లేదు. ఒక మేల్ యాక్టర్ థియేటర్ కి జనాలను ఎలా రప్పించి, మార్కెట్ చేస్తున్నారో అదే విధంగా ఒక ఫిమేల్ యాక్టర్ కి కూడా ఆ సత్తా ఉందంటే నిస్సందేహంగా ఇద్దరికీ సమాన పారితోషకం ఇవ్వచ్చు. ఒక ఫిమేల్ యాక్టర్ కి జనాల్ని రప్పించే స్టామినా, మార్కెట్ ఉంటే కచ్చితంగా ఆ సమాన రెమ్యూనరేషన్ ఇవ్వాలి. ఈ హీరోయిన్ తో సినిమా చేస్తే కోట్లు వస్తాయి.. పెద్ద కలెక్షన్స్ వస్తాయని నమ్మితే కచ్చితంగా ఇవ్వచ్చు.. ముఖ్యంగా హీరోకి ఇంతిస్తున్నారు హీరోయిన్ కి కూడా ఇంత ఇవ్వాలి అనేది కాదు.. ఎవరైతే హీరోలాగా జనాలను థియేటర్ కి తీసుకొస్తారో వారికి కచ్చితంగా సమాన పారితోషకం ఇవ్వాలి” అని కీర్తి సురేష్ తెలిపింది.

Alsoread: Pawan Kalyan: ‘ మానాడు’ కోసం పవన్ కళ్యాణ్ ధరించిన చెప్పుల ధర ఎంతో తెలుసా?

అందుకే హీరోలకు ఎక్కువ పారితోషకం – కీర్తి సురేష్

ఇకపోతే హీరోలకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అంటే వాళ్ళని చూసి అభిమానులు థియేటర్ కి వస్తారు కాబట్టి ఆ రేంజ్ లో ఇస్తున్నారు అని కూడా తెలిపింది. మొత్తానికైతే హీరో హీరోయిన్లకు సమాన రెమ్యూనరేషన్ పై గట్టి కౌంటర్ ఇచ్చింది కీర్తి సురేష్. అంతేకాదు ఇదే విషయంపై మాట్లాడుతూ.. ముఖ్యంగా చాలామంది హీరోయిన్లకు థియేటర్లకు జనాలను రప్పించే స్థామినా ఉంది. ఒకరకంగా చెప్పాలి అంటే మా కంటే హీరోలేం తోపులేం కాదు అంటూ కూడా కీర్తి సురేష్ చెప్పిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Related News

Samantha: మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ స్టెప్పులు వేయనున్న సమంత.. తగ్గట్లేదుగా?

Film industry: ఏంటీ.. ఈ హీరోయిన్ స్కూల్ లో ఉన్నప్పుడే హీరోయిన్గా చేసిందా?

Rajamouli: బయటపడ్డ రాజమౌళి కొత్త సెంటిమెంట్.. హీరోల మెడలో ఆ లాకెట్ ఉండాల్సిందేనా?

SSMB29 Firts Look: ఓర్నీ రాజమౌళి మళ్లీ కాపీ కొట్టాడు కదా… ఏకంగా పవన్‌ కళ్యాణ్‌నే టచ్ చేశాడు

Spirit Villain : స్పిరిట్ దిమ్మతిరిగే ట్విస్ట్… ప్రభాస్‌కు విలన్ సందీప్ రెడ్డి వంగనే ?

SSMB 29: మహేష్ బర్తడే స్పెషల్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జక్కన్న!

Big Stories

×