BigTV English
Advertisement

Naga Vamsi: దేవర ఫేక్ కలక్షన్స్.. నిర్మాత నాగవంశీ ఏమన్నాడంటే.. ?

Naga Vamsi: దేవర ఫేక్ కలక్షన్స్.. నిర్మాత నాగవంశీ ఏమన్నాడంటే.. ?

Naga Vamsi: సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కు హీరో, హీరోయిన్, డైరెక్టర్ వస్తారు. కాయాన్ని , సితార ఎంటర్ టైన్మెంట్స్ అయితే మాత్రం కచ్చితంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ఉంటాడు.  అసలు ఒక సినిమాకు నిర్మాతనే ఇంటర్వ్యూ చేసే ట్రెండ్  క్రియేట్ చేసింది నాగవంశీనే అని చెప్పాలి.  ఏది ఉన్న  ముక్కుసూటిగా మీడియా ముందు మాట్లాడమే అతనికి గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయాలను అందుకుంటున్న బ్యానర్ లిస్ట్ లో సితార ఒకటి.  స్టార్ హీరోల సినిమాల్లో సగం సినిమాలు ఈ బ్యానర్  నుంచే వస్తున్నాయి.


ఇక ఈ మధ్యనే దేవర మూవీ రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను నాగవంశీ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. మొదటి రోజు నుంచే దేవర రికార్డ్ కలక్షన్స్ అందుకుంది.. నిత్యం పోస్టర్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు మేకర్స్.  అయితే ఆ రికార్డ్ కలక్షన్స్ అన్ని ఫేక్ అని, సినిమాపై హైప్ పెంచడానికి మేకర్స్ ఇలా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండ్ చేసిన విషయం తెల్సిందే.

ఇకపోతే తాజాగా ఈ ఫేక్ కలక్షన్స్ పై నిర్మాత నాగవంశీ స్పందించాడు. తాజాగా సితార ఎంటర్ టైన్మెంట్స్ నుంచి వస్తున్న లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ లో నాగవంశీ కి దేవర కలక్షన్స్  సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నారా..? అని అడగ్గా.. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని సమాధానిమిచ్చాడు.


ఇక ఫేక్ కలక్షన్స్ అని ప్రచారం జరుగుతుంది.. కాస్తా ఎక్కువ వేసి ప్రచారం చేస్తున్నారట.. నిజమేనా.. ? అన్న ప్రశ్నకు నాగవంశీ మాట్లాడుతూ.. ” నేను హ్యాపీ అని చెప్పినా మీరు ఒప్పుకోరు కదా.. డబ్బులు వచ్చాయని చెప్తే.. మీరు నమ్మడం లేదు.ఫస్ట్ డే కలక్షన్స్ ఇచ్చాం.. ప్రతి ఒక్కరు తప్పే అని చెప్పారు. సో, ఇప్పుడు నేను డబ్బులు వచ్చాయి అన్నా కూడా మీరు నమ్మరు. ఇప్పుడు ఈమె ఉద్దేశ్యంలో మీరు నన్ను ఏది అనుకుంటే అదే అనుకోండి. నేను సినిమా కొని.. నా డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాను. నా డిస్టిబ్యూటర్లు హ్యాపీ.

మరి ఎగ్జిబిటర్ల పరిస్థితి ఏంటి అంటే.. ఒకసారి వారందరి నంబర్స్  తీసుకొని మీ ముందే కాల్ చేసి మాట్లాడతాను. ఎన్ని సమోసాలు అమ్మారు. ఎన్ని కూల్ డ్రింక్స్ అమ్మారు. ఎన్ని పార్కింగ్ టికెట్స్ అమ్మారు అనేది తెలుసుకుందాం” అని చెప్పుకొచ్చాడు. ఇక ఇది కాకుండా ఆ నంబర్స్ ను అధికారికంగా ప్రకటించడం కేవలంఫ్యాన్స్ కోసం మాత్రమే అని, అది హాలీవుడ్ నుంచి వస్తున్న ఆచారమని  చెప్పుకొచ్చాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×