Telugu Movie industry : సమాజంలో స్వార్థపరులు ఉంటారు. వాళ్లు మాట్లాడే మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండు. (మ్యాచ్ అవ్వదు) ఇప్పుడు అలానే ఉంది టాలీవుడ్ లో పరిస్థితి. తెలుగు సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది అంటూ పొద్దన నిద్రలో నుంచి లేచినప్పటి నుంచి రాత్రి బెడ్‌పైన పడుకునే వరకు అంటున్నారు.
ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే అది చేయాలి ఇది చేయాలి అంటూ చాలా మాటలు చెబుతున్నారు. కానీ, వాటిని పాటించడానికి మాత్రం ఎవ్వరూ రెడీగా ఉండటం లేదు.
అప్పుడు బన్నీ వాస్…
ఈ మధ్యే… ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఓ ట్వీట్ వేశాడు. ఆ ట్వీట్ సారాశం ఏంటంటే…? సింగిల్స్ స్క్రీన్స్ కాపాడుకోవడం మన బాధ్యత అని, అందుకు అందరూ కృషి చేయాలి అని రాసుకొచ్చాడు. అంతే కాదు… మూవీ రిలీజైన 28 రోజుల్లోపు ఓటీటీలకు ఇస్తే, సింగిల్ థియేటర్స్ చచ్చిపోతాయి అనే ఓ మంచి మాట కూడా చెప్పాడు.
గురువు గారు పాఠాలు చెబుతారు… కానీ, పాటించరు అన్నట్టు బన్నీ వాస్ ఆయన చెప్పినది అసలు పాటించలేదు. 28 రోజుల లోపు ఓటీటీలకు ఇవ్వొద్దు అంటూ ట్వీట్ వేసిన కొద్ది రోజులకే ఆయన నిర్మించిన సింగిల్ మూవీని 28 రోజులు గడవక ముందే ఓటీటీలోకి దింపేశాడు.
దీంతో బన్నీ వాస్ అంత పెద్దగా పెట్టిన ట్విట్టర్ పోస్ట్‌కు అర్థం ఏంటి ? చెప్పే వారైన కనీసం పాటించాలి కదా అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు.
ఇప్పుడు నాగ వంశీ..?
బన్నీ వాస్ వేసిన ట్వీట్… ఆ తర్వాత ఆయన సినిమా ఓటీటీ అప్డేట్, దీనిపై ట్రోల్స్. ఇలా జరిగాయి. ఇప్పుడు నాగ వంశీ కూడా అదే దారి తొక్కుతున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా 28 రోజుల్లోనే తన సినిమాను ఓటీటీకి ఇవ్వబోతున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
ఆయన నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డం. విజయ్ దేవరకొండ హీరోగా ఈ మూవీ వస్తుంది. ఈ మూవీ అనేక సార్లు వాయిదా పడుతూ వస్తుంది. నిజానికి ఈ మూవీ మే 31న రిలీజ్ కావాల్సింది. కానీ, వాయిదా తర్వాత జూలై 4 అని అనౌన్స్ చేశారు. అయితే ఈ టైంలో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ ఉండబోతుందని సమాచారం. వీరమల్లుకు పోటీ వెళ్లడానికి వీళ్లు ఇంట్రెస్ట్ చూపించరు. సో ఆ.. డేట్ నుంచి కూడా వాయిదా వేసుకుని, జూలై 26న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారట.
ఈ రిలీజ్ డేట్ పక్కన పెడితే.. కింగ్‌డం ఓటీటీ డీల్ ఇప్పటికే క్లోజ్ అయింది. భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. వీరి మధ్య జరిగిన డీల్ ప్రకారం… మూవీ ఏ డేట్ నా రిలీజ్ అయినా… 28 రోజులకే నెట్‌ఫ్లిక్స్ వాళ్లు స్ట్రీమ్ చేసుకుంటారట.
ఇది కానీ నిజమే అయితే… నాగ వంశీ సినిమా కూడా 28 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా బడా ప్రొడ్యూసర్లు అందరూ కూడా తమ సినిమా లాభాల్లో ఉండాలని అప్పటి కోసం ఆలోచించి… అతి తక్కువ రోజుల్లోనే ఓటీటీకి ఇచ్చేస్తున్నారు.
దీని వల్ల నిర్మాతలకు అప్పటి వరకు లాభాలు రావొచ్చు. కానీ, తర్వాత కాలంలో ఇండస్ట్రీలో సంక్షోభం మరింత ముదిరిపోయే అవకాశం ఉంది. ఓటీటీలకు ఇలాంటి పెద్ద సినిమాలు కనీసం 8 నుంచి 10 వారాల టైం తీసుకుంటే… అప్పుడు థియేటర్స్ లో ఆడే అవకాశం ఉంది. కానీ, ఇలా 28 రోజులకే ఓటీటీల్లోకి తీసుకువస్తే.. నిర్మాత బన్నీ వాస్ చెప్పినట్టు సింగిల్స్ థియేటర్స్ చచ్చిపోవడం ఖాయం.