Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇటీవల జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈయన ఇప్పుడు సుజీత్ (Sujith ) దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. హరీష్ శంకర్ (Harish Shankar ) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా? అని అందరిలో అనుమానాలు రేకెత్తాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో పవన్ కళ్యాణ్..
అయితే సడన్ గా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకున్నట్టు ఒక పోస్టర్ రిలీజ్ చేసి.. సినిమా ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఏకంగా షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే వీడియో పంచుకుంది. దీనికి..” ఇస్ బార్ సిర్ఫీ ఆంధీ నహిన్, తూఫాన్ హై.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో చేరారు. షూటింగ్ పురోగతిలో ఉంది.. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి’ అంటూ రాసుకు వచ్చింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో..
ఇకపోతే ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కారులో నుంచి దిగి ఫ్లవర్ బొకే అందుకొని లోపలికి వెళ్లారు. ఆ తర్వాత హరీష్ శంకర్ తనకు సీన్ వివరిస్తూ ఉండగా. క్యూట్ గా స్మైల్ ఇస్తూ అమ్మాయిల మనసు కూడా దోచుకున్నాడు. అయితే ఆయన పక్కనే యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా ఉంది. అలాగే గన్ పట్టుకొని పవర్ స్టార్ అలా ఇలా తిప్పుతూ తన స్టైలిష్ లుక్ ను మరొకసారి చూపించారు. ఇక ఫైనల్గా “హట్..సాలే” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ కి పూనకాలు వచ్చేస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెట్టేశారు. ఇక షూటింగ్ వేగంగా జరగడమే తరువాయి.
ALSO READ: Fauji: ఫౌజీ మూవీలో బాలీవుడ్ స్టార్.. ఇక్కడే సెటిల్ అయ్యేటట్టు ఉన్నారే?
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విశేషాలు..
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sree Leela) హీరోయిన్గా ఫిక్స్ అయ్యింది.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నహాలు, సిద్ధం చేస్తున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస పెట్టి తన సినిమా షూటింగ్లను పూర్తి చేసే పనిలో పడ్డారని చెప్పవచ్చు.
Iss baar sirf Aandhi nahin, toofan hain 💥🌪️
POWER STAR @PawanKalyan joins the sets of #UstaadBhagatSingh ❤🔥
Shoot in progress. Stay tuned for more updates.
@harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #UjwalKulkarni @SonyMusicSouth @UBSthefilm pic.twitter.com/CPFTdLrBHl— Mythri Movie Makers (@MythriOfficial) June 11, 2025