Vande Bharat Sleeper Income: వందే భారత్ స్లీపర్ రైళ్ల ఆదాయం ఎన్ని కోట్లలోకి వెళ్లిందో తెలుసుకుంటే నోరెళ్లబెట్టక మానరు. ఒక్కో రైలు దేశానికి ఎంత లాభం తెస్తుందో ఊహించలేరు. ఇంకా దీన్ని తయారు చేయడానికి ఖర్చయిన మొత్తాన్ని వినగానే.. ఔరా అనిపించక మానదు. మొత్తం మీద ఇండియన్ రైల్వే ముఖచిత్రాన్ని మార్చే ఈ స్లీపర్ రైళ్ల గురించి ఈ రహస్యం తెలుసుకుంటే, వారెవ్వా.. వాట్ ఏ ఐడియా సర్ జీ అనేస్తారు. అదేమిటో తెలుసుకోవాలంటే, తప్పక ఈ కథనం పూర్తిగా చదవండి.
ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్లను కేవలం రోజు పూట ప్రయాణాలకే ఉపయోగిస్తూ వచ్చారు. అయితే, రాత్రిపూట ప్రయాణించే వారికీ అదే హైస్పీడ్, అదే లగ్జరీ, అదే సాఫ్ట్నెస్ అందించేందుకు తాజాగా వందే భారత్ స్లీపర్ ట్రైన్లు రంగంలోకి దిగాయి. ఇవి రైలు ప్రయాణంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టనున్నాయి.
ఎక్కడెక్కడ ప్రారంభమయ్యాయి?
2025 జనవరిలో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు చెన్నైలోని ICF (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుండి ట్రయల్ రన్ చేపట్టి విజయవంతంగా పరీక్షలు పూర్తిచేసింది. మొదటి దశలో ఈ రైళ్లను ఢిల్లీ – ముంబయి, హౌరా – న్యూఢిల్లీ, బెంగళూరు – హైదరాబాద్ మార్గాల్లో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కొన్ని మార్గాల్లో ఇప్పటికే ప్రయోగాత్మక రన్‌లతో పరీక్షలు జరుగుతున్నాయి.
ఎంతమంది ప్రయాణికులకైనా ఒకే మార్గం!
ఇండియన్ రైల్వే 2025 చివరి నాటికి మొత్తం 200 వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో రైలు 16 కోచ్‌లతో ఉంటుంది. ఇందులో 11 కోచ్‌లు AC 3-tier, 2 కోచ్‌లు AC 2-tier, 1 ప్యాంట్రీ, 1 పవర్ కార్, 1 గార్డ్స్ కోచ్ ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా భారతీయ సాంకేతికతతో, మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా చెన్నై ICFలోనే తయారవుతున్నాయి.
ప్రయాణికులకు సూపర్ లగ్జరీ ఫీచర్లు!
ఈ నైట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేవలం వేగవంతమైన ప్రయాణమే కాదు.. ప్యాసింజర్ల నిద్రకూ, సౌకర్యానికీ తక్కిన మోడరన్ ఫీచర్లతో నిండి ఉన్నాయి. వాటిలో సౌండ్ ప్రూఫ్ విండోలు, స్పెషల్ మూడ్ లైటింగ్, ఫైర్ సేఫ్టీ అలారంలు, బయోటాయిలెట్లు, స్టెప్‌లెస్ ఎంట్రీ, హై-స్పీడ్ WiFi, యుఎస్‌బీ చార్జింగ్ పోర్ట్స్, అడ్వాన్స్ డిజిటల్ డిస్‌ప్లేలు, పిల్లో, బ్లాంకెట్, బెడ్ లైన్ అన్నీ స్టాండర్డ్‌గా ఉంటాయి. ఈ ప్రయాణం.. నిద్రించుకుంటూ సరదాగా గమ్యానికి చేరే ఆనందాన్ని ఇస్తుంది!
ఒక రైలు తయారీకి ఎంత ఖర్చు?
ఒక్కో వందే భారత్ స్లీపర్ రైలు తయారీకి సుమారు రూ.150 కోట్ల ఖర్చు వస్తోంది. 200 రైళ్లు అన్నమాట అంటే, మొత్తం ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ.30,000 కోట్లకు పైగా చేరవచ్చు. ఇది రైల్వే చరిత్రలో అతి పెద్ద పెట్టుబడి ప్రాజెక్టులలో ఒకటి.
Also Read: Rare Indian Traditions: ఇద్దరు భర్తల సాంప్రదాయం.. ఎక్కడో కాదు, ఇండియాలోనే!
ఎంత ఆదాయం రాబడుతుంది?
ప్రస్తుత అంచనాల ప్రకారం, ఒక్కో స్లీపర్ రైలు ఏడాదికి రూ.10 కోట్లు నుంచి రూ.20 కోట్లు వరకు ఆదాయం తీసుకురాగలదని అంచనా. మొత్తం 200 రైళ్లు నడిస్తే, ఏటా రూ. 700 కోట్లు నుంచి రూ.1400 కోట్ల వరకు ఇండియన్ రైల్వేకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం టికెట్ల విక్రయాలే కాదు.. ప్యాంట్రీ సేవలు, డిజిటల్ అడ్స్, లగేజ్ చార్జీలు ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంది.
భవిష్యత్తులో ఎక్కడెక్కడ నడుస్తాయి?
రైల్వే శాఖ ప్రణాళికల ప్రకారం, వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో క్రింది ప్రధాన మార్గాల్లో సేవలందించనున్నాయి. ఢిల్లీ – చెన్నై, ముంబయి – హైదరాబాద్, బెంగళూరు – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి, పాట్నా – కోల్‌కతా, అహ్మదాబాద్ – వారణాసి రైల్వే మార్గాలలో ఈ రైళ్ల సేవలు చేరువ కానున్నాయి. ఈ మార్గాల్లో రాత్రి ప్రయాణ సమయాన్ని 2 నుండి 4 గంటల వరకు తగ్గించగలిగితే, వందే భారత్ స్లీపర్ ట్రైన్లు చరిత్ర సృష్టిస్తాయని అంచనా.
ఈ ప్రయాణం మామూలు కాదు.. భవిష్యత్తుకి బాట
ఇది కేవలం రైలు ప్రయాణం కాదు.. ఇది భారత రైల్వే యొక్క సాంకేతిక పురోగతి, దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే నూతన దారి. వేగం, నిశ్శబ్దత, భద్రత, విశ్రాంతి అన్నీ కలిపి ఇవ్వడం వందే భారత్ స్లీపర్ ప్రత్యేకత. తెలుసుకున్నారుగా వందే భారత్ అసలు సంగతులు.. మొత్తం మీద మన దేశం మేక్ ఇన్ ఇండియా పేరుతో తెచ్చిన ఈ రైళ్లు.. తక్కువ కాలంలో అధిక ఆదాయాన్ని తీసుకురానున్నాయి.