Nagachaithanya -Sobitha Dulipala : అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నాగ చైతన్య సమంతతో విడిపోయాక, బాలీవుడ్ బ్యూటీ శోభిత దూలిపాళ ప్రేమలో పడ్డాడు. నిజానికి శోభిత కూడా తెలుగు అమ్మాయే. తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్ లో చదువుకుంది. ఆ తర్వాత మోడలింగ్ కోసం ముంబై వెళ్ళింది. ప్రస్తుతం ఆమె సౌత్ తో పాటు బాలీవుడ్ చిత్రాల్లో సైతం నటిగా రాణిస్తోంది. ఓ సందర్బంలో వీరిద్దరూ కలిశారు. ఆ సమయంలో ఏర్పడ్డ స్నేహం తర్వాత ప్రేమలో పడేలా చేసింది. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకుని తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని అనుకున్నారు. పెద్దలను తమ పెళ్లికి ఒప్పించారు.
ఇక గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఇటీవల ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు వివాహానికి ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో డిసెంబర్ 4 న నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి జరగనుంది. ఈ మేరకు అతిథులకు ఆహ్వానాల్ని కూడా పంపిస్తున్నారు. తాజాగా వీరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. చైతూ శోభిత హల్దీ వేడుకలు ప్రారంభం అయ్యాయి. అందుకు సంబందించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నాగార్జున ఇంట పెళ్లి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి.. వీరిద్దరి పెళ్లికి ఇక ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఒక్కో వేడుకను మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలో తాజాగా హల్దీ వేడుకలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యుల సమక్షంలోనే హల్దీ ఫంక్షన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత ఇద్దరు కలిసి మంగళ స్నానాలు చేశారు..
ఇక డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఎనిమిది గంటల 13 నిమిషాలకు అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత వివాహం జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేసి అందులో అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత వివాహం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిద్దరి వివాహం బ్రాహ్మణ సంప్రదాయంలో దాదాపు 8 గంటల పాటు జరగనున్నట్లు తెలుస్తుంది.
తాజాగా నాగ చైతన్య – శోభిత హల్దీ ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన అక్కినేని ఫ్యాన్స్ జంట చాలా బాగున్నారని, ఇద్దరు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య శోభిత పెళ్లి వేడుకల్లో ఎంత అందంగా ఉన్నారు కింద వీడియోలో చూడండి..
నాగ చైతన్య-శోభిత ధూళిపాళ హల్దీ ఫంక్షన్
మొదలైన చైతూ-శోభిత వివాహ వేడుక క్రతువులు
హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు
డిసెంబర్ 4, రాత్రి 8.13 గంటలకు జరగబోయే వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్@chay_akkineni @sobhitaD… pic.twitter.com/SLZmDe6Z7v
— BIG TV Breaking News (@bigtvtelugu) November 29, 2024