Gundeninda GudiGantalu Today episode November 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో కారు పోయిందని చెప్పలేక బాలు జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడ జాబ్ దొరకదు. అటు ప్రభావతి ఇంట్లో సరుకులు వస్తున్నాయి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళాడా మొగుడు పెళ్ళాలు డబ్బులు ఇవ్వకుండా తిని కూర్చున్నామని అనుకుంటున్నారా అనేసి రోహిణి ముందే మీనా బాలు పరువు తీసేలా మాట్లాడుతుంది. ఈసారి కాస్త లేట్ అయిందని చెప్తున్నాడు కదా అత్తయ్య ఇస్తాడు లే అనేసి అంటుంది. డబ్బులే కదా కావాల్సింది ఆయన దగ్గరికి వెళ్లి నేను తీసుకొచ్చేస్తాను అనేసి మీనా బయలుదేరుతుంది. గాజులను తాకట్టు పెట్టాలని కొట్టు దగ్గరికి వెళ్తే అది మూసేసి ఉంటుంది. ఇక మీనా వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి రమ్మంటుంది.. తమ్ముడు గాజులుకు ఇచ్చింది. అతను డబ్బులు తెచ్చి ఇస్తాడు. మీనా తీసుకెళ్లి ప్రభావతికి ఇస్తుంది. బాలు డబ్బులు ఎక్కడివి అని అడుగుతాడు. దాంతో మీనా అబద్దం చెప్తుంది. కానీ బాలు గాజులు తాకట్టు పెట్టిన విషయం తెలుసుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. మీనా బాలును స్నానం చేసి వస్తాడు. మీనా టవల్ ను పట్టుకొని ఊహల్లో ఎంజాయ్ చేస్తుంది. బాలు వచ్చి ఏంటి ఊహల్లో తేలుతున్నావు అని అడిగితే ఏమి లేదు అంటుంది. ఇక బాలుకి ఒక షర్ట్ తీసుకొచ్చి ఇస్తుంది. చేసేటప్పుడు షర్టు మీద మరకలు పడతాయి ఇంత కొత్తదేం అవసరం లేదని పాత చొక్కా వేసుకొని వెళ్తాడు. ఇక మీనా ఇంట్లో చెత్త తీసి బయటపడేస్తుంటే పక్కింటి ఆవిడొచ్చి మీనా మీ ఆయన మా ఆయన పనిచేస్తున్న అపార్ట్మెంట్లో కార్లు క్లీన్ చేస్తున్నాడంట నీకు తెలుసా అనేసి చెప్తుంది. దానికి మీనా ఈ విషయాన్ని ఈరోజు తెలుసుకోవాలని బాలు ఎక్కడ పని చేస్తున్నాడని వెళ్లాలనుకుంటుంది. ఇక ప్రభావతికి కామాక్షి ఫోన్ చేస్తుంది. అర్థం కాని భాషలో మాట్లాడుతుంది. ఇంటికి తీసుకొచ్చి ప్లాన్ ఏమన్నా వేస్తున్నావా ఆలోచిస్తున్నావా కనీసం లేకున్నా అంటే నీకు కోడలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పోతుంది అనేసి ప్రభావతికి చెప్తుంది..
నువ్వు అలా ఆలోచిస్తూ లేట్ చేస్తే.. శృతి వాళ్ళ నాన్న వచ్చి రవి గాడికి ఇల్లారికం తీసుకువెళ్తాడని, తర్వాత నువ్వు ఏం చేసినా.. ఫలితం ఉందనీ, ఏ నిర్ణయం త్వరగా తీసుకోమని సలహా ఇస్తోంది. ఏం చేయాలో చెప్పమని మీనాక్షిని అడుగుతుంది ప్రభావతి. ఈ రోజే రవిని వెళ్లి కలవమని సలహా ఇస్తుంది. దీంతో ప్రభావతి తోడుగా రమ్మని కామాక్షిని రిక్వెస్ట్ చేస్తుంది. దీనికి ముందుగా రాలేదని చెప్పినా ప్రభావతి రిక్వెస్ట్ చేయడంతో తర్వాత వస్తానని హామీ ఇస్తుంది కామాక్షి. ఇద్దరు కలిసి వెళ్లాలని రెడీ అయ్యి ఫోన్ చెయ్యి అని కామాక్షి అంటుంది. ఇక బాలు క్లినర్ పనిచేస్తున్నాడా అని మీనా చూడటానికి వెళ్తుంది. అక్కడికి వెళ్లేసరికి బాలు కార్లను క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే ఓ కారు ఓనర్ వచ్చి తన కారులో ఫోను కనిపించడం లేదని, ఫోన్ తీసావా? అంటూ బాలుని నిలదీస్తాడు. తాను చూడలేదని తనకు తీయాల్సిన అవసరం లేదని, చెప్పి వేరే కారణం చేస్తూ ఉంటాడు. ఇందులోనే మరో వ్యక్తి వచ్చి ఏమైందని ప్రశ్నించగా.. తనకు ఫోన్ కనిపించడం లేదని, కానీ తన ఫోన్ ను కారులోనే పెట్టానని, కారు కీస్ బాలుకు మాత్రమే ఇచ్చానని చెబుతాడు..
ఇలా ముక్కు మొహం తెలియని వాడిని పనిలో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని అందరు బాలు పై నిందలు వేస్తారు.. తనకు ఫోన్ దొంగతనం చేయవలసిన పనిలేదని, తాను నిజాయితీగా ఉంటానని చెబుతాడు. కానీ, ఆ కారు ఓనర్ బాలుని చెక్ చేయడానికి ప్రయత్నించాడు. తన ఒంటిపై చేయి వేస్తే బాగోదని చెబుతాడు బాలు. ఇంతలోనే మరో వ్యక్తి వచ్చి ఫోన్ గ్రౌండ్ లోనే మరిచిపోయారని తీసుకవచ్చి ఇస్తాడు. దీంతో అప్పటి వరకూ రెచ్చిపోయిన వ్యక్తి అక్కడి నుంచి సైలెంట్ గా జారుకుంటాడు. తన కూడా కారుందనీ, కానీ అవసరాల దృష్టిగా ఇలా పనిచేయాల్సి వస్తుందని బాలు బాధపడుతాడు. కనీసం తనకు సారీ చెప్పకుండా వెళ్ళిపోయినందుకు భాద పడుతున్నాను అని అంటాడు. మీనా బాలుకు జరిగిన అవమానం చూసి అదే తలచుకుంటూ ఏడుస్తూ వెళ్తుంది.
ఇక రవి, శృతిలు తమ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే శృతికి ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి.. కొత్త కాపురం ఎలా ఉందని అడుగుతుంది. ఏం కొత్త కాపురం.. అంతా రొటీన్ గా ఉండదంటుంది మీనా. దీంతో హనీమూన్ కి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఎంజాయ్ చేయలేం. రోజురోజుకు బరువులు, బాధ్యతలు పెరుగుతాయని సలహాయిస్తుంది. దీంతో హానీమూన్ కి వెళ్లాదనీ రవిని శృతి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ రవి మాత్రం ఇప్పటికే మన రెండు ఫ్యామిలీలు హ్యాపీగా లేరు మనం ఎలా ఇలా అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..