BigTV English
Advertisement

Nagarjuna : సినిమాను మించిన ట్విస్ట్, నాగార్జున పై క్రిమినల్ కేస్

Nagarjuna : సినిమాను మించిన ట్విస్ట్, నాగార్జున పై క్రిమినల్ కేస్

Nagarjuna : గత రెండు రోజులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాపిక్ అంతా కూడా అక్కినేని ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. దీని కారణం మినిస్టర్ కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలు. అయితే దీనికంటే కొన్ని రోజులు ముందు నుంచే నాగార్జున చుట్టూ చాలా కథనాలు వినిపిస్తూ వస్తున్నాయి. హైడ్రాలో భాగంగా ఎన్ కన్వెన్షన్ ను సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. అక్కడినుంచి మొదలైన చర్చ పలు రకాల దారులు తీస్తూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఎన్ కన్వెన్షన్ ను కూల్చకుండా ఉండాలి అంటే నటి సమంతను తన వద్దకు పంపించాలి అని కేటీఆర్ నాగార్జునను అడిగినట్లు కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఏకమై ఖండించారు. మునిపెన్నడూ లేని విధంగా సెలబ్రిటీలు అంతా కూడా ఈ విషయంపై తమ రియాక్షన్ తెలియజేశారు.


కేవలం మామూలు నటులు మాత్రమే కాకుండా అల్లు అర్జున్, ఎన్టీఆర్, సూపర్ సార్ మహేష్ బాబు వంటి హీరోలు కూడా ఈ విషయంపై స్పందించారు. ఇండస్ట్రీలో ఉన్న అందరి స్పందనను చూసి నాగార్జున కూడా ఇదంతా కూడా మా నాన్నగారి ఆశీర్వాదం వలన వచ్చిన సపోర్ట్ అని తన రెస్పాన్స్ తెలియజేశారు. అయితే సురేఖ చేసిన వ్యాఖ్యలను కూడా ఆవిడ వెనక్కి తీసుకొని నటి సమంతకు క్షమాపణలు తెలియజేశారు. అయితే వివాదం అంతా సద్దుమణుగుతుంది అనుకునే టైంలో ఇప్పుడు సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. అదే అక్కినేని నాగార్జున పై మాదాపూర్ స్టేషన్లో కేసు నమోదు కావడం.

వివరాల్లోకి వెళితే తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అంటూ నాగార్జున పై కంప్లైంట్ చేశారు జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. దీంతో మాదాపూర్ పోలీసులు క్రిమినల్ కేసును నాగార్జున పై నమోదు చేశారు. ఇక దీనిపై నాగార్జున ఎలా రెస్పాండ్ అవుతారు వేచి చూడాలి. ఇక నాగార్జున ప్రొఫెషనల్ విషయానికి వస్తే సంక్రాంతి కానుక రిలీజ్ అయిన నా సామిరంగా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సంక్రాంతికి మరో సినిమాతో సిద్ధమవుతానంట అప్పట్లో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే పెద్దగా నాగార్జున నుంచి రావడం లేదు. నాగార్జునతో పాటు అక్కినేని హీరోలు తమ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. నాగచైతన్య నటిస్తున్న తండెల్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×