BigTV English

Nagarjuna New Kia Car : కొత్త కియా కారు కొన్న నాగార్జున.. ప్రత్యేకత ఏంటంటే..?

Nagarjuna  New Kia Car : కొత్త కియా కారు కొన్న నాగార్జున.. ప్రత్యేకత ఏంటంటే..?
Nagarjuna  New Kia Car


Nagarjuna New Kia Car : సినీ సెలబ్రిటీల్లో కార్లు అంటే క్రేజ్ ఉన్నవారు చాలామంది ఉంటారు. అందుకే ఎంత ఖర్చు అయినా కొత్త కొత్త మోడల్స్‌ను తయారు చేయించుకొని మరీ ఉపయోగిస్తుంటారు. దేశంలో ఎవరి దగ్గరా లేని కార్లు కూడా కొందరు సినీ సెలబ్రిటీల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పటికే కింగ్ నాగార్జున గ్యారేజ్‌లో ఎన్నో హై ఎండ్ మోడల్ కార్లు ఉన్నాయి. ఆ కార్ల కలెక్షన్‌లోకి మరో కొత్త కారు యాడ్ అయ్యింది. అదే కియా ఈవీ6 ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్. ప్రస్తుతం ఈ కారు ప్రత్యేకత గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

బ్రాండ్ న్యూ కియా ఈవీ6 అనేది దేశంలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడే నాగార్జున దానిని కొనుగోలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కారును తమ ఇంట్లోనే కలిసి డెలివరీ తీసుకున్నారు నాగార్జున, అమల. దీనికి సంబంధించిన ఫోటోను కియా స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నాగార్జున గారికి, అమల గారికి కియా ఈవీ6ను అందుకున్నందుకు కంగ్రాచులేషన్స్.’ అనే క్యాప్షన్‌తో కియా ఈ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో చూస్తే కారు కలర్ వైట్ అని తెలుస్తోంది.


ఆల్ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్‌తో కియా.. ఈవీ6 కారును తయారు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇండియాలో 100 యూనిట్లను అమ్మాలని నిర్ణయించుకుంది. కానీ అనూహ్యంగా ఈ కారు లాంచ్ జరిగిన రోజే.. వారికి 355 ప్రీ బుకింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఉన్న ఇతర కియా కార్లతో పోలిస్తే.. కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అంతే కాకుండా ఎన్నో రకాలుగా దీనిని మోడిఫై చేసి కస్టమర్లను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తోంది ఈ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ.

ప్రస్తుతం దేశంలో కియా ఈవీ6 కార్లు అనేవి చాలా తక్కువమంది దగ్గరే ఉన్నాయి. క్రికెటర్ ఎమ్ ఎస్ ధోనీ శాటిన్ సిల్వర్ కలర్‌లో కియా ఈవీ6ను కొనుగోలు చేశారు. ధోనీ ఈ కారు కొనగానే తన సీఎస్‌కే టీమ్‌మేట్స్ రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్‌తో కలిసి రైడ్‌కు వెళ్లిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ప్రముఖ సీనియర్ మలయాళ నటుడు మోహన్‌లాల్ కూడా ఇప్పటికే ఈవీ6ను సొంతం చేసుకున్నారు. తన స్నేహితుడు అలెక్స్ బాబు ఈ కారును మోహన్‌లాల్‌కు బహుమతిగా అందించారు. ఇప్పుడు కియా ఈవీ6 ఓనర్‌షిప్‌ను సొంతం చేసుకున్నవారిలో నాగార్జున కూడా యాడ్ అయ్యారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×