BigTV English

Nagarjuna: పిటీషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ.. కొలిక్కి రానుందా..?

Nagarjuna: పిటీషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ.. కొలిక్కి రానుందా..?

Nagarjuna..సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ విషయం ఎవరిని ఇబ్బంది పెడుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒకరిపై కోపాన్ని ఇంకొకరిపై చూపించినట్టు.. ఎవరి మీదో ఉన్న కోపాన్ని ఏదో అనుకొని పరిస్థితుల్లో నోరు జారితే.. ఇప్పుడు దానినే పట్టుకొని కొంతమంది పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అసలు విషయంలోకెళితే కొండా సురేఖ కేటీఆర్ (Ktr)ను దృష్టిలో పెట్టుకొని మధ్యలో అక్కినేని కుటుంబం పై కామెంట్లు చేయడంతో హర్ట్ అయిన అక్కినేని కుటుంబం తాజాగా నాంపల్లి కోర్టులో కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేస్తూ.. కేసు ఫైల్ చేయించారు నాగార్జున. ముఖ్యంగా సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న తమ కుటుంబంపై కొండా సురేఖ(Konda surekha) అసత్య ఆరోపణలు చేశారని, తమ పరువుకు నష్టం కలిగించారని, అందుకే రూ .100 కోట్లు పరువు నష్టం కట్టాలి అంటూ ఆయన కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.


నాంపల్లి కోర్టులో తదుపరి విచారణ..

నాంపల్లి కోర్టులో విచారణ జరపగా మొదటి సాక్షి సుప్రియ యార్లగడ్డ, నాగార్జున నుంచి స్టేట్మెంట్ ను రికార్డు చేసింది కోర్టు. తదుపరి విచారణను వాయిదా వేస్తూ తీర్పునిచ్చిన కోర్టు నేడు నాంపల్లి కోర్టులో నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ పై విచారణ కొనసాగించనుంది. ఈరోజు రెండవ సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ను కోర్టు రికార్డు చేయనుంది అని సమాచారం. ఇకపోతే మంగళవారం విచారణ సందర్భంగా.. దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను కోర్టు ప్రశ్నించినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ తన కుటుంబం పై అమర్యాద పూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున స్పష్టం చేశారు. దీనివల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు . అంతేకాదు సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని కూడా ఆయన గుర్తు చేశారు.


పరువు నష్టం కలిగిందంటూ కోర్టు ముందు వాపోయిన నాగార్జున..

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ తమ కుటుంబానికి అండగా నిలబడడానికి కారణం తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఆశీస్సులు అని ఆయన తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయి అని, జాతీయస్థాయిలో కూడా అనేక అవార్డులు వచ్చాయని, ముఖ్యంగా సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా తాము ఎన్నో చేపట్టామని, అలాంటి పేరున్న తమ కుటుంబం పై అమర్యాదకరంగా మాటలు మాట్లాడడం సముచితం కాదని తెలిపారు. ముఖ్యంగా తమ కొడుకు విడాకులకు కారణం మాజీ మంత్రి కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారంటూ ఆయన తెలిపారు. అంతేకాదు తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఆమె మాట్లాడిన మాటలకు మేము తలెత్తుకోలేకపోతున్నాము కాబట్టి ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ కోర్టులో కోరారట నాగార్జున. ఇంకా ఇప్పుడు రెండవ సాక్షి వాంగ్మూలాలను తీసుకోబోతున్న కోర్టు తదుపరి నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×