BigTV English
Advertisement

Unstoppable with NBK : తండ్రితో గొడవలు… బన్నీతో షాకింగ్ నిజాన్ని బయట పెట్టించిన బాలయ్య

Unstoppable with NBK : తండ్రితో గొడవలు… బన్నీతో షాకింగ్ నిజాన్ని బయట పెట్టించిన బాలయ్య

Unstoppable with NBK : గత కొన్నాళ్ల నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ద్వారా మరో షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు అల్లు అర్జున్. తండ్రితో విభేదాల గురించి ప్రశ్నిస్తూ బాలయ్య బన్నీ నుంచి ఇంట్రెస్టింగ్ విషయాలను రాబట్టారు. ముఖ్యంగా అందులో తండ్రితో గొడవల గురించి అల్లు అర్జున్ షోలో కొట్టిన డైలాగ్ ఒకటి లీక్ అయ్యింది. అదేంటో చూసేద్దాం పదండి.


తండ్రితో గొడవలు నిజమే.. 

ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన మొట్టమొదటి బుల్లితెర షో ‘అన్ స్టాపబుల్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఈ షోకు సంబంధించిన రెండు సీజన్లు పూర్తి కాగా, తర్వాత వచ్చిన లిమిటెడ్ ఎడిషన్ కూడా ఓకే అనిపించింది. ఇక ఇప్పుడు సీజన్ 3 కి శ్రీకారం చుడుతున్నారు మేకర్స్. ఆల్రెడీ దీనికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కాగా, సీజన్ 3లో పాల్గొనబోతున్న గెస్ట్ లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉండడం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇంకో రెండు నెలలలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉండడంతో దీనిని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ తో ఈ ఎపిసోడ్ ను మేకర్స్ ప్లాన్ చేసి ఉండొచ్చని టాక్ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తో బాలయ్య షోలో భాగంగా పలు వివాదాస్పద అంశాలపై మాట్లాడినట్టుగా సమాచారం. ముఖ్యంగా తండ్రితో ఆయనకున్న విభేదాల గురించి బాలయ్య ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.


ఇక ఈ షోలో భాగంగా ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఎవరి మధ్య అయినా ఓ పర్టిక్యులర్ పాయింట్ మీద అభిప్రాయ బేధాలు రావడం అనేది కామన్. మా నాన్నకు నాకు మధ్య కూడా అంతే. అయితే అంతమాత్రాన ప్రేమ, సంబంధాలు, అభిమానాలు మా మధ్య లేవని అర్థం కాదు’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఒకటి లీక్ అయింది. చూస్తుంటే ఈ ఎపిసోడ్లో బాలయ్య వివాదాస్పద అంశాలు అన్నింటిని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో తండ్రి కొడుకులకు మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయని టాక్ నడిచింది. అలాగే రీసెంట్ ఎలెక్షన్స్ తో అల్లు అరవింద్ పవన్ కు సపోర్ట్ చేస్తే, బన్నీ మాత్రం ఆపొజిత్ పార్టీకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్ అన్నాడు అంటూ వైరల్ అవుతున్న ఈ కామెంట్ దేనికి సంబంధించి చేసిందో తెలియాల్సి ఉంది.

వరుస వివాదాల్లో అల్లు అర్జున్…

ఏపీ ఎలక్షన్స్ లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా వైసిపి పార్టీకి సంబంధించిన లీడర్ కు సపోర్ట్ చేయడం వివాదాస్పదమైంది. మరోవైపు ‘పుష్ప’ సినిమాకు కూడా వరుస అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇక రీసెంట్ గా తన భార్య స్నేహారెడ్డి పుట్టినరోజుకు మరో వైసీపీ లీడర్ హాజరు కావడం కూడా చర్చనీయాంశమైంది. మరి వివాదాలు అన్నింటికి అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ ఫుల్ స్టాప్ పెడతాడా అనేది చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×